Five Horns Sheep: నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తోన్న అయిదు కొమ్ముల గొర్రె.. ఎక్కడో తెలుసా.? Viral Video

| Edited By: Ravi Kiran

Jul 23, 2021 | 6:56 AM

Five Horns Sheep: ఈ అనంత విశ్వం ఎన్నో వింతలకు మరెన్నో అద్భుతాలకు నెలవు. ఒకప్పుడు కేవలం ఆయా ప్రాంతాలకే పరిమితం అయిన ఈ వింతలు సోషల్ మీడియా పుణ్యామని ప్రపంచాన్ని చుట్టేస్తున్నాయి...

Five Horns Sheep: నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తోన్న అయిదు కొమ్ముల గొర్రె.. ఎక్కడో తెలుసా.? Viral Video
Sheep With Five Horns
Follow us on

Five Horns Sheep: ఈ అనంత విశ్వం ఎన్నో వింతలకు మరెన్నో అద్భుతాలకు నెలవు. ఒకప్పుడు కేవలం ఆయా ప్రాంతాలకే పరిమితం అయిన ఈ వింతలు సోషల్ మీడియా పుణ్యామని ప్రపంచాన్ని చుట్టేస్తున్నాయి. భూమిపై ఏ మూలన ఏం జరిగినా వెంటనే అరచేతిలో ప్లే అవుతున్నాయి. వైరల్‌గా మారుతూ ప్రపంచాన్ని చుట్టేస్తున్నాయి. ముఖ్యంగా అరుదైన జాతికి చెందిన జంతువులు, పక్షుల వీడియోలు నిత్యం సోషల్‌ మీడియాలో సందడి చేస్తూనే ఉన్నాయి. తాజాగా అలాంటి ఓ వీడియోనే నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

తాజాగా నైజీరియాలోని లాగోస్‌ అనే ప్రాంతంలో బక్రీద్‌ పర్వ దినం సందర్భంగా కొందరు వ్యాపారులు గొర్రెలను అమ్మకానికి పెట్టారు. ఆ గొర్రెల్లో ఓ గొర్రె అందరి దృష్టిని ఆకర్షించింది. సాధారంగా గొర్రెకు రెండు కొమ్ములు ఉంటాయని మనకు తెలుసు.. కానీ నైజీరియాలో దర్శనమిచ్చిన ఈ గొర్రెకు ఏకంగా అయిదు కొమ్ములు ఉండడం విశేషం. ఈ విచిత్ర గొర్రెను అక్కడే ఉన్న కొందరు వీడియోలు తీసి నెట్టింట పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో కాస్త వైరల్‌గా మారింది. ఇక ఈ వీడియోను ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ రాయిటర్స్‌ ట్విట్‌ చేసింది. ఈ వీడియో చూసిన వారంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇక కొందరైతే ఇదేదో కీడును శంకిస్తోందని, ఈ గొర్రె ఏదో ప్రమాదానికి సూచనగా కనిపిస్తోందంటూ కలియుగం కాన్సెప్ట్‌ను మరోసారి తెరపైకి తెస్తున్నారు. మరి ఈ గొర్రెకు అయిదు కొమ్ములు ఉండడానికి ఏమైనా సైంటిఫిక్‌ కారణం ఉందా.. పరిశోధకులే చెప్పాలి. మరి వైరల్‌గా మారిన ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..

Also Read: Password Safety: వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో ఉద్యోగులు విస్మరిస్తున్న ఐదు క్లిష్టమైన పాస్‌వర్డ్ భద్రతా నియమాలు ఇవే!

Maharashtra Heavy rain: వరద బీభత్సంలో మహాజనం.. వర్షం నీటిలో నానుతున్న పట్టణాలు..పల్లెలు..

Fish and Milk: చేపలు..పాలు కలిపి తినడం వలన బొల్లి వ్యాధి వస్తుందా? నిపుణులు ఏమంటున్నారు?