Rare Talent: అరటి ఆకుపై అద్భుత కళాఖండాలు.. దేవతా చిత్రాలతో అబ్బురపరుస్తున్న అరుదైనకళ.
ప్రపంచానికి తెలియని అరుదైన కళాకారులు, గొప్ప ఆర్టిస్ట్‌లు మట్టిలో మాణిక్యాల్లా మిగిలిపోతున్నారు. ప్రస్తుత కాలంలో ఇంటర్నెట్ అందుబాటులోకి రావడంతో ఇలాంటి వారు అప్పుడప్పుడూ వెలుగులోకి వస్తున్నారు. కళాకారుల్లో ఒక్కొక్కరూ ఒక్కో ప్రత్యేకత కలిగి ఉంటారు.
బిహార్‌లోని ముజాఫర్‌పూర్‌కి చెందిన అభిషేక్ నారాయణ్ అనే వ్యక్తి కుంచెను చేతిలో పట్టుకొని రంగులతో అరటి ఆకు చిరగకుండా అద్భుతమైన దేవతమూర్తులు, పురాణ పురుషుల బొమ్మలను అచ్చుగుద్దినట్లుగా వేస్తున్నాడు. శివపార్వతులు, రాధా కృష్ణుల బొమ్మలను ఫోటోలు తీసినంత అందంగా, అద్భుతంగా అరటి ఆకులపై చిత్రాలు వేస్తున్నాడు అభిషేక్ నారాయణ. ఇతని ట్యాలెంట్‌కి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఇతనికి ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. అభిషేక్ నారాయణ్ అరటి ఆకుపై ఏ అందమైన బొమ్మను వేసినా వేలల్లో లైక్‌లు, వీడియోలను షేర్ చేస్తుంటారు. ఈ కళతో పాటు ప్రొడక్షన్ డిజైనర్‌గా కూడా మరో రంగంలో రాణిస్తున్నాడు. చేసే పనిలో శ్రద్ద, ఏకాగ్రత పెడితే అరటి ఆకు మీద కాదు నీళ్ల మీద కూడా బొమ్మలు వేయవచ్చని నిరూపిస్తున్నాడు అభిషేక్ నారాయణ్. ఇంతటి టాలెంట్ ఉన్న యువకుడు. తన పెట్టుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు ఈవిధంగా కళాఖండాలను తన మునివేళ్లతో ముద్రిస్తున్నాడు. ఇలాంటి అరుదైన కళాకారులు ఎందరో మనమధ్య ఉన్నారని, ప్రభుత్వం తరపునుంచి సరైన ప్రోత్సాహం అందిస్తే వారు మరింత ఉన్నతస్థాయికి చేరుకుంటారని చెబుతున్నాడు అభిషేక్ నారాయణ్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...