Dog – Owner: యజమానిని బతికించుకునేందుకు విశ్వప్రయత్నం చేసిన శునకం.. ఆ కుక్క బాధ మాటల్లో చెప్పలేనిది.
విశ్వాసానికి కుక్కను మంచిన జీవి మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. పట్టెడన్నం పెడితే ప్రాణాలను సైతం పణంగా పెట్టి తన యజమాని ఇంటికి రక్షణగా నిలుస్తుంది. తాజాగా అలాంటి సంఘటనే ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఉరికి వేలాడుతూ కనిపించిన తన యజమానిని కాపాడుకోవాలని ఆ మూగజీవి ఎంతో ప్రయత్నించింది.
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఝాన్సీలోని పంచవటి కాలనీలో సంభవ్ అగ్నిహోత్రి అనే 23 ఏళ్ల యువకుడు నివసిస్తున్నాడు. అతడు సివిల్స్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నాడు. తండ్రి ఆనంద్ అగ్నిహోత్రి రైల్వే శాఖలో విధులు నిర్వర్తిస్తున్నాడు. తల్లి అనారోగ్యంతో బాధపడుతోంది. చికిత్స కోసం ఆమెను భోపాల్‌కు తీసుకెళ్లారు. పెంపుడు కుక్క అలెక్స్ తోడుగా సంభవ్ తన ఇంట్లో ఉన్నాడు. మే 7వ తేదీ రాత్రి ఆనంద్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా సంభవ్ నుంచి సమాధానం రాలేదు. దీంతో పక్కింటి వారికి ఫోన్ చేసి కుమారుడి గురించి ఆరా తీశారు. ఇరుగుపొరుగు వారు సంభవ్ ఇంటికి చేరుకోగా.. వారిపై అలెక్స్ దాడి చేసింది. అప్పటికే ఆ యువకుడు ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో వారు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులను సైతం కుక్క ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో వారు శునకానికి మత్తుమందు ఇచ్చి బంధించారు. అనంతరం సంభవ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలెక్స్ కూడా కాసేపటికే మరణించడం గమనార్హం. శునకానికి అధిక మోతాదులో మత్తు మందు ఇవ్వడం వల్లే మరణించిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jagapathi Babu – Rajinikanth: రజినీకాంత్ పై రాజకీయ విమర్శలు.. జగపతి బాబు రియాక్షన్..
Akhil Akkineni: ఒంటరైపోయిన అఖిల్.. డిప్రెషన్లో మరో దేశానికి..! ఎయిర్ పోర్ట్ లో వీడియో..
Naga Chaitanya vs Nagarjuna: ఆ విషయంలో తండ్రికి ఎదురునిలుస్తున్న నాగచైతన్య..!