Monkey Viral Video: నువ్వు దేవుడివి బాస్.. ఇదికదా అసలైన మానవత్వం అంటే.. కోతిపిల్లకు పునర్జన్మ ఇచ్చినట్టే.
ఓ కోతి పిల్ల ఒళ్లంతా ప్లాస్టిక్ తీగలు చట్టుకుపోయి, బురదలో చిక్కుకుపోయి ఎటూ కదల్లేని స్థితిలో, ప్రాణాలు చిక్కబట్టుకొని బిక్కుబిక్కుమంటూ చూస్తోంది. ఎవరూ దాన్ని చూసి ఉండకపోతే ఆకలితో అలమటిస్తూ మరణించేది. కానీ, ఆ చిన్ని ప్రాణిని ఓ వ్యక్తి చూసాడు.
ఓ కోతి పిల్ల ఒళ్లంతా ప్లాస్టిక్ తీగలు చట్టుకుపోయి, బురదలో చిక్కుకుపోయి ఎటూ కదల్లేని స్థితిలో, ప్రాణాలు చిక్కబట్టుకొని బిక్కుబిక్కుమంటూ చూస్తోంది. ఎవరూ దాన్ని చూసి ఉండకపోతే ఆకలితో అలమటిస్తూ మరణించేది. కానీ, ఆ చిన్ని ప్రాణిని ఓ వ్యక్తి చూసాడు. దాని పరిస్థితి అర్ధమై వెంటనే దాన్ని కాపాడాలని రంగంలోకి దిగాడు. కోతి పిల్లను వెంటనే తన చేతుల్లోకి తీసుకున్నాడు. భయం లేదంటూ ఆచిన్నిప్రాణికి భరోసా ఇచ్చాడు. ఆ తరువాత అతి జాగ్రత్తగా దాని వంటి మీద ఉన్న తీగలన్నీ తొలగించాడు. మొదట ఆ కోతి పిల్ల అతను తననేం చేస్తాడోనని భయపడింది. దగ్గరకు రానీయలేదు. కానీ, అతడు ఆ కోతిపిల్లకు చుట్టుకున్న తీగలు జాగ్రత్తగా తొలగిస్తుంటే ఆ చిన్ని ప్రాణికి అర్ధమైంది అతను తనను కాపాడుతున్నాడు అని. అంతే వెంటనే అతని షర్టును గట్టిగా పట్టుకొని అలాగే ఉండిపోయింది. ఆ వ్యక్తి జాగ్రత్తగా తీగలన్నీ తొలగించాడు. తీగలనుంచి బయటపడిన ఆ చిన్నిప్రాణి కృతజ్ఞతగా అతని గుండెలపై వాలిపోయింది. అతను దానిని శుభ్రంచేసి, తినడానికి ఓ మామిడిపండును కూడా ఇచ్చాడు. ఆ పండును ఎంతో ఆత్రంగా తింటుంటే అతను ఆనందంతో మురిసిపోయాడు. నెట్టింట వైరల్‌గా మారిన ఈ వీడియో నెటిజన్లను బాగా కదిలించింది. మానవత్వం అంటే ఏంటో కళ్లకు కట్టినట్టు చూపించావంటూ కొందరు కామెంట్ చేశారు. ‘‘ఎందుకో కానీ ఆ కోతిని చూడగానే దాని బాధ నా మనసుకు తగిలింది. కానీ దేవుడు అప్పుడప్పుడూ నీలాంటి వారిని లోకంలోకి పంపిస్తుంటాడు’’ అంటూ మరో నెటిజన్ కోతిని రక్షించిన వ్యక్తిపై ప్రశంసలు కురిపించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jagapathi Babu – Rajinikanth: రజినీకాంత్ పై రాజకీయ విమర్శలు.. జగపతి బాబు రియాక్షన్..
Akhil Akkineni: ఒంటరైపోయిన అఖిల్.. డిప్రెషన్లో మరో దేశానికి..! ఎయిర్ పోర్ట్ లో వీడియో..
Naga Chaitanya vs Nagarjuna: ఆ విషయంలో తండ్రికి ఎదురునిలుస్తున్న నాగచైతన్య..!
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

