Viral Video: సాయం చేయడానికి డబ్బులే ఉండాలా.? మంచి మనసు ఉంటే చాలదా.. హృదయాన్ని కదిలిస్తున్న వైరల్‌ వీడియో.

Viral Video: సాధారణంగా ఎవరికైనా సహాయం చేయాలంటే అది కేవలం డబ్బులున్న వారు మాత్రమే చేసే పని. మాకే డబ్బులు లేక ఇబ్బందులు పడుతుంటే మేము ఏం సహాయం చేస్తామని పెదవి విరుస్తాంటారు. అయితే ఎదుటి వారికి సహాయం చేయాలంటే..

Viral Video: సాయం చేయడానికి డబ్బులే ఉండాలా.? మంచి మనసు ఉంటే చాలదా.. హృదయాన్ని కదిలిస్తున్న వైరల్‌ వీడియో.
Viral Video

Updated on: Feb 15, 2022 | 7:56 PM

Viral Video: సాధారణంగా ఎవరికైనా సహాయం చేయాలంటే అది కేవలం డబ్బులున్న వారు మాత్రమే చేసే పని. మాకే డబ్బులు లేక ఇబ్బందులు పడుతుంటే మేము ఏం సహాయం చేస్తామని పెదవి విరుస్తాంటారు. అయితే ఎదుటి వారికి సహాయం చేయాలంటే డబ్బుతో పని లేదని, మంచి మనసు ఉంటే చాలని చాటి చెప్పాడు ఓ పెద్దాయన. తన ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా.. మూగ జీవులపై అతను చూపిన వాత్సల్యం నెటిజన్ల హృదయాలను కదిలిస్తోంది.

వివరాల్లోకి వెళితే ఒక పెద్దాయనకు ఆకలితో తిరుగుతోన్న ఓ వీధి కుక్క కనిపించింది. దీంతో అతను సైకిల్‌ తీసుకొచ్చిన అన్నాన్ని ఆ కుక్కకు అందించాడు. ఎంతో ఆకలితో ఉన్న ఆ కుక్క లాగించేసింది. ఆ సమయంలో ఆ పెద్దాయన కళ్లల్లో కనిపించిన సంతోషం ఎన్ని డబ్బులు పెట్టిన దొరకదు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

దీనంతటినీ అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియోగా తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ పెద్దాయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సాయం చేయడానికి కావాల్సింది డబ్బు కాదు, మంచి మనసు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Also Read: Prabhas: అదృష్టమంటే ఈ అందాల భామదే.. తక్కువ టైమ్‌లోనే ప్రభాస్‌తో నటించే ఛాన్స్‌..

EIL Recruitment: ఇంజనీరింగ్ చేసిన వారికి బంపరాఫర్‌.. ఇంజనీర్స్‌ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు..

Tiger Viral Video: వావ్ ఎం ఐడియా గురు..! కళాకారుడి చేతిలో జీవం పోసుకున్న పులి.. చాక్లెట్ టైగర్ వీడియో