Viral Video: వేగంగా దూసుకొచ్చిన రైలు.. పట్టాలపై ఆవు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.. వైరల్ వీడియో..
Viral Video: రైల్వే ట్రాక్‌లపై నిత్యం ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంటుంది. ప్రమాదవశాత్తు కొందరు వ్యక్తలు రైలు ప్రమాదం బారినపడుతుంటారు. రైళ్లను ఉన్నపలంగా ఆపలేకపోవడం వల్ల ఇలాంటి..
Viral Video: రైల్వే ట్రాక్‌లపై నిత్యం ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంటుంది. ప్రమాదవశాత్తు కొందరు వ్యక్తలు రైలు ప్రమాదం బారినపడుతుంటారు. రైళ్లను ఉన్నపలంగా ఆపలేకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. అయితే రైలు ప్రమాదాలు కేవలం మనుషులకే పరిమితం కాకుండా మూగ జీవాలకు సైతం తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో వెళ్లే రైళ్ల కింద నిత్యం ఏదో ఒక జంతువు పడిపోయి మృతిచెందుతున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. తాజాగా ఇలాంటి ప్రమాదానికి సంబంధించిన ఓ వీడియోనే నెట్టింట వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. ఓ గూడ్స్ రైలు చిన్న ఫ్లైఓవర్‌పై నుంచి వేగంగా వెళుతోంది. అయితే ట్రాక్‌పైకి ఎలా వచ్చిందో, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ ఓ ఆవు వచ్చింది.
అయితే ఆ ఆవు ట్రాక్‌పై కాకుండా ట్రాక్ పక్కన నిల్చొని ఉంది. బ్రిడ్జి కింద కాలువ ఉండడంతో ఆవు ఏటు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే వేగంగా వస్తోన్న రైలు ఒక్కసారిగా ఆవును ఢీకొట్టింది. దీతో ఆవు పక్కనే ఉన్న కాలువలో పడిపోయింది. అయితే అదృష్టకర విషయమేంటంటే.. ఆవు చిన్న గాయంతోనే బయటపడింది. నీటిలో పడిపోగానే వెంటనే లేచి అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీనంతనిటీ అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆవుకు ఎలాంటి ప్రమాదం కాకపోవడంతో ఈ వీడియో చూసిన వారు ఊపిరి పీల్చుకున్నారు. పెను ప్రమాదం తప్పింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. నెట్టింట వైరల్ అవుతోన్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి మరి..
View this post on Instagram
Job Mela In AP: నేడు ఆంధ్రప్రదేశ్‌లో భారీ జాబ్‌మేళ.. 5 కంపెనీల్లో నియామకాలు.. పూర్తి వివరాలు..