Viral Video: శునకం నేర్పిన గుణపాఠం.. వైరల్‌గా మారిన వీడియో.. మనుషుల కంటే కుక్కలకే జ్ఞానం ఎక్కువ..
Viral Video: మనుషులకు, జంతువులకు మధ్య ఉన్న తేడా.. మానవుడు ఆలోచించగలడు, జంతువులు ఆ పనిచేయలేవు. తన విచక్షణ జ్ఞానంతో మంచి ఏంటి.? చెడు ఏంటి..? అన్న దానిపై ఓ నిర్ణయం...
Viral Video: మనుషులకు, జంతువులకు మధ్య ఉన్న తేడా.. మానవుడు ఆలోచించగలడు, జంతువులు ఆ పనిచేయలేవు. తన విచక్షణ జ్ఞానంతో మంచి ఏంటి.? చెడు ఏంటి..? అన్న దానిపై ఓ నిర్ణయం తీసుకోగలడు. సమాజంలో నలుగురిలో ఎలా జీవించాలన్న విజ్ఞతతో ఉంటాడు కాబట్టే మనిషిని సంఘ జీవి అంటారు. కానీ తాజాగా నెట్టింట వైరల్ అవుతోన్న ఓ వీడియో చూస్తే మాత్రం మనిషి తెలివిని ప్రశ్నార్థకంగా మారుస్తోంది. ఒక శునకానికి ఉండే జ్ఞానం కూడా మనిషికి లేదా అని ప్రశ్నిస్తోంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. రోడ్డుపై ఓ కారు ఆగి ఉంది. అందులో నుంచి ఓ వ్యక్తి చెత్తతో కూడిన ప్లాస్టిక్ కవర్‌ను నడిరోడ్డుపై పడేశాడు. దీంతో అదే మార్గంలో వెళుతోన్న ఓ శునకం వెంటనే ఆ కవర్‌ను నోట పట్టుకొని తిరిగి కారులోకి విసిరేసింది. ఇదంతా అక్కడే ఉన్న ఓ వ్యక్తి తన కెమెరాలో బంధించాడు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. సుధా రమన్ అనే ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. మనుషులకు ఇదొక గుణపాఠం అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసిన ఈ వీడియో నెటిజెన్లను ఆలోజింపచేస్తోంది. ఇదంతా చూస్తుంటే మనుషుల కంటే జంతువులే మేలు అనిపిస్తోంది కదూ..
నెట్టింట వైరల్‌గా మారిన వీడియో ఇదే..
A lesson to you, dear Humans!!!
Ps – Let’s appreciate the training given to this dog. Credits n d video. pic.twitter.com/y500IOjOP4
— Sudha Ramen IFS ?? (@SudhaRamenIFS) May 4, 2021
Also Read: CM KCR Health Corona: కరోనాను జయించిన సీఎం కేసీఆర్.. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారన్న వైద్యులు..
Viral News: రిలాక్స్ అవుతున్న పిల్లి.. పైపైకి పాకుతున్న పాము.,. షాకింగ్ వీడియో.!
Central Vista project: సెంట్రల్ విస్టా ప్రాజెక్టు ఆపండి.. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్..