Viral: రూ.500 అద్దె గదిలో.. డెలివరీ బాయ్ హోం టూర్.. చూశారంటే షాకే!
ఎవరైనా సెలబ్రెటీలు రూ.కోట్లు ఖర్చు పెట్టి కట్టుకున్న తమ విలాసవంతమైన ఇల్లుని హోం టూర్ పేరుతో అందరికీ చూపిస్తూ తమ ఆనందాన్ని పంచుకుంటారు. సోషల్ మీడియాలో ఈ వీడియోలను అందరూ ఎంతో ఆసక్తిగా చూస్తారు. నెట్టింట్లో అలాంటి వీడియోలు వైరల్‌గా మారిపోతాయి. అయితే.. ముంబయిలో ఓ జొమాటో డెలివరీ బాయ్ పెట్టిన తన రూమ్ టూర్ కూడా అలాగే వైరల్ అయ్యింది. అయిదే ఆ బోయ్ ఉండే రూమ్ ఇంద్రభవనంలా ఉందనుకుంటే పొరపాటే..!
ఎవరైనా సెలబ్రెటీలు రూ.కోట్లు ఖర్చు పెట్టి కట్టుకున్న తమ విలాసవంతమైన ఇల్లుని హోం టూర్ పేరుతో అందరికీ చూపిస్తూ తమ ఆనందాన్ని పంచుకుంటారు. సోషల్ మీడియాలో ఈ వీడియోలను అందరూ ఎంతో ఆసక్తిగా చూస్తారు. నెట్టింట్లో అలాంటి వీడియోలు వైరల్‌గా మారిపోతాయి. అయితే.. ముంబయిలో ఓ జొమాటో డెలివరీ బాయ్ పెట్టిన తన రూమ్ టూర్ కూడా అలాగే వైరల్ అయ్యింది. అయిదే ఆ బోయ్ ఉండే రూమ్ ఇంద్రభవనంలా ఉందనుకుంటే పొరపాటే..! అతడు ఉంటున్నది కేవలం రూ.500 అద్దె గది. అది కూడా ముంబయి మురికివాడలో..! ఆ చిన్న గదికి సంబంధించి వీడియో చేశాడు. దీన్ని సోషల్ మీడియాలో షేర్ చేయగానే.. 4.5 మిలియన్ల మందికి పైగా వీక్షించారు.
ఈశాన్య రాష్ట్రాల నుంచి ప్రంజయ్ బోర్గోయరీ అనే యువకుడు ముంబయి నగరానికి వలస వచ్చాడు. జొమాటోలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ మహానగరంలోని మురికి వాడలో, ఇరుకు వీధుల్లో మరో వ్యక్తితో కలిసి తాను ఉంటున్న చిన్న గదికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాలో పంచుకున్నాడు. తన వృత్తి, ఇక్కడి జీవిత పరిస్థితులను తెలియజేశాడు. ముంబయి మురికివాడల్లో జీవితం ఎంత కఠినంగా ఉంటుందో ఈ వీడియో ద్వారా తెలిసిందని పలువురు కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు అతడు వీడియో చేసిన విధానాన్ని మెచ్చుకుంటూ పలువురు స్పందిస్తున్నారు. ఓ వ్యక్తి అతడికి మూడు నెలల అద్దె డబ్బులు పంపించాడు. ఇలా పలువురు అతడికి మద్దతుగా నిలుస్తున్నారు. అతడికి మంచి రోజులు రావాలంటూ పలువురు ఆకాంక్షించారు. ఆ యువకుడు పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతుండటం, కుటుంబ ఆర్థిక పరిస్థితులు.. ఇలా పలు సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ తన అభిరుచులపై ఆసక్తిని కొనసాగిస్తున్నాడు. సింగర్ కావాలని, ఫుట్‌బాలర్‌గా ఎదగాలన్న అతడి కల నెరవేరాలని పలువురు కోరుకుంటున్నారు. అందంగా ఉన్నావని.. మోడలింగ్ చేయాలని మరికొందరు సూచిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
పరిహారంలోనూ పక్షపాతమేనా? రాజీవ్ రహదారి బాధితుల ఆవేదన !
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్‌కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!

