AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bus Fire accident: హైవేపై వెళ్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు.. అప్రమత్తమైన డ్రైవర్‌.

Bus Fire accident: హైవేపై వెళ్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు.. అప్రమత్తమైన డ్రైవర్‌.

Anil kumar poka
|

Updated on: Aug 20, 2023 | 9:16 AM

Share

ఒక హైవేపై వెళ్తున్న బస్సులో ఉన్నట్టుండి మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన డ్రైవర్‌ దానిని రోడ్డు పక్కగా నిలిపివేశాడు. దీంతో బస్సులోని ప్రయాణికులంతా బయటకు పరుగులుతీశారు. అనంతరం కొన్ని క్షణాల్లో ఆ బస్సు మంటల్లో కాలిపోయింది. అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ వీడియో క్లిప్‌ నెట్టింట చేరడంతో అదికాస్తా వైరల్‌గా మారింది.

ఒక హైవేపై వెళ్తున్న బస్సులో ఉన్నట్టుండి మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన డ్రైవర్‌ దానిని రోడ్డు పక్కగా నిలిపివేశాడు. దీంతో బస్సులోని ప్రయాణికులంతా బయటకు పరుగులుతీశారు. అనంతరం కొన్ని క్షణాల్లో ఆ బస్సు మంటల్లో కాలిపోయింది. అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ వీడియో క్లిప్‌ నెట్టింట చేరడంతో అదికాస్తా వైరల్‌గా మారింది.  జనరల్ పాజ్ హైవే వచ్చేపోయే వాహనాలతో ఫుల్‌ రద్దీగా ఉంది. ఇంతలో ఒక డబుల్‌ డెక్కర్‌ బస్సు ఆ హైవేపై వెళ్తోంది. ఆకస్మాత్తుగా బస్సు వెనుక భాగంలో మంటలు చెలరేగాయి. అలర్టయిన డ్రైవర్‌ ఆ బస్సును నిలిపివేసి ప్రయాణికులందరినీ అప్రమత్తం చేశాడు. దీంతో అందులోని ప్రయాణికులు వెంటనే బస్సు దిగి పరుగులు తీశారు. కొన్ని నిమిషాల్లో మంటలు బస్సు మొత్తం వ్యాపించడంతో ఆ బస్సు పూర్తిగా కాలిపోయింది. అలాగే హైవేపై కూడా మంటలు వ్యాపించాయి. రెండు కార్లు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఈ దృశ్యాలన్నీ ఆ హైవేపై ఉన్న సీసీటీవీలో రికార్డ్‌ అయ్యాయి. అర్జెంటీనా పోలీసులు ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌ అయ్యింది. ఈ వీడియో చూసి నెటిజన్లు షాక్‌ అయ్యారు. అయితే ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడటంతో అందరూ హ్యాపీ ఫీలయ్యారు. డ్రైవర్‌పై ప్రశంసలు కురిపించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...