Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దూడకు జన్మనిచ్చిన గేదె..పుట్టిన దూడను చూసి యజమాని షాక్‌..!వీడియో

దూడకు జన్మనిచ్చిన గేదె..పుట్టిన దూడను చూసి యజమాని షాక్‌..!వీడియో

Samatha J

|

Updated on: Feb 14, 2025 | 8:03 PM

ప్రకృతిలో ఎన్నో వింతలూ విశేషాలు జరుగుతూ ఉంటాయి. కొన్ని వింత సంఘటనలు జరిగినప్పుడు వీరబ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్టే జరుగుతుంది అని అందరూ అనుకుంటూ ఉంటారు. వేపచెట్టుకు పాలు కారడం.. మనుషులు వింత ఆకారంలో జన్మించడం, రెండు తలలతో దూడలు జన్మించడం ఇలాంటి సంఘనలు చాలానే నెట్టింట చూశాం. తాజాగా అలాంటిదే మరో విచిత్ర సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

సాధారణంగా గేదెలు నల్లగా ఉంటాయి. వాటి దూడలు కూడా నల్లగానే పుడతాయి. ఆవుల్లో మాత్రం భిన్న రంగులు ఉంటాయి. గోధుమరంగులో, తెలుపు వర్ణంలో, అలాగే తెలుపు నలుపు కలిసి పుట్టిన ఆవులు కూడా ఉంటాయి. వీటిని బచ్చల ఆవులంటారు.. ఇక ఆవుల్లోనూ పూర్తి నల్లగా ఉండే ఆవులు పుడతాయి. వీటిని కపిలగోవులు అంటారు. గోవుల్లో వీటికి ప్రత్యేక స్థానం ఉంది. ఇకపోతే ఉత్తరప్రదేశ్‌లో ఓ గేదె… గోధుమ వర్ణంలో ఉన్న దూడకు జన్మనిచ్చింది. దాని రూపురేఖలు కూడా ఆవును తలపిస్తున్నాయి. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ రైతు ఇంట రాత్రి వేళ అతని గేదె ప్రసవించింది. సహజంగానే అందరూ దూడను తీసుకెళ్లి పక్కన కట్టేశారు. మర్నాడు ఉదయం లేచి చూసేసరికి ఆ దూడ రంగును చూసి అంతా ఆశ్చర్యపోయారు. విషయం తెలిసి చుట్టు పక్కలవారుకూడా పెద్ద సంఖ్యలో వచ్చి ఆవు దూడను తలపిస్తున్న గేదెదూడను చూసి ఆశ్చర్యపోయారు. ఈ వింత సంఘటనను చూసేందుకు చుట్టు పక్కల గ్రామస్తులు కూడా ఆ ఇంటికి క్యూ కట్టారు.

మరిన్ని వీడియోల కోసం :

స్పీడ్ బోటులో షికారు చేస్తున్న పర్యాటకులు..నది మధ్యలోకి వెళ్లగానే..

భార్యను పాము కాటు వేసిన ప్రాంతానికి వెళ్లిన భర్త..అంతలోనే ఊహించని షాక్ వీడియో

అలసిపోయి చెట్టు కింద కూర్చొన్న సింహం.. తర్వాత ఏం జరిగిందంటే వీడియో

ఈ సారు మామూలోడు కాదు.. సర్కారు ఆఫీస్‌లోనే ఏకంగా మకాం పెట్టాడు…

భార్య కోసం రూ. 15 లక్షలతో రైల్వే ఉద్యోగం కొని.. విడిపోవడంతో.. వీడియో