విండో సీటు బుక్ చేసుకున్న ప్రయాణికుడు! విమానం ఎక్కాక భారీ షాక్!వీడియో
ఇటీవల కాలంలో ఇండిగో ఎయిర్‌లైన్స్ సంస్థ పేరు తరచూ వార్తల్లో నిలుస్తోంది. కొందరు విమాన సర్వీసుపై ప్రశంసిస్తూ పోస్టులు పెడితే మరికొందరు సేవాలోపాన్ని హైలైట్ చేస్తూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.. ఈ రెండో రకానికి చెందిన మరో ఉదంతం ఇండిగో పేరును మరోసారి ట్రెండింగ్‌లోకి తెచ్చింది. ఇండిగోలో విండో సీటు బుక్ చేసుకున్న ప్రయాణికుడి పరిస్థితి చివరకు ఏమైందో తెలిసి జనాలు ఆశ్చర్యపోతున్నారు
ముత్తుప్రదీప్ అనే ట్విట్టర హ్యాండిల్‌లో ఈ పోస్టు కనిపించింది. సదరు ప్రయాణికుడు తాను విమానంలో కిటికీ పక్కనున్న సీటు బుక్ చేసుకున్నట్టు చెప్పాడు. కానీ విమానం ఎక్కాక అతడికి దిమ్మతిరిగినంత పనైంది. తన సీటు పక్కన కిటికీ లేదు. కేవలం గోడ మాత్రమే ఉంది. దీంతో, తన సీటులో కూర్చుని కిటికీ ఏదని ప్రశ్నిస్తున్నట్టు పోజు పెట్టి అతడు సెల్ఫీ దిగాడు. దీన్ని నెట్టింట పంచుకుని ఇండిగోను నిలదీశాడు. ‘‘ఇండిగో.. నేను కిటికీ పక్కనున్న సీటు కోసం డబ్బులు కట్టా. కానీ ఇక్కడ కిటికీ మాత్రం లేదు’’ అని పోస్టు పెట్టాడు.ప్రయాణికుడి ప్రశ్నతో పాటు సెల్ఫీలో అతడు ఇచ్చిన తుంటరి పోజు కూడా జనాలను బాగా ఆకట్టుకోవడంతో ఈ పోస్టు తెగ వైరల్ అవుతోంది. జనాలు పెద్ద ఎత్తున కామెంట్ చేశారు.
మరిన్ని వీడియోల కోసం :
స్పీడ్ బోటులో షికారు చేస్తున్న పర్యాటకులు..నది మధ్యలోకి వెళ్లగానే..
భార్యను పాము కాటు వేసిన ప్రాంతానికి వెళ్లిన భర్త..అంతలోనే ఊహించని షాక్ వీడియో
అలసిపోయి చెట్టు కింద కూర్చొన్న సింహం.. తర్వాత ఏం జరిగిందంటే వీడియో
ఈ సారు మామూలోడు కాదు.. సర్కారు ఆఫీస్‌లోనే ఏకంగా మకాం పెట్టాడు…
భార్య కోసం రూ. 15 లక్షలతో రైల్వే ఉద్యోగం కొని.. విడిపోవడంతో.. వీడియో

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!

తాచుపాము కరిచినా..10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థి వీడియో

తెలుగు రాష్ట్రాల్లో బుసలు కొడుతున్న పాములు వీడియో

ఈ కోతికి ఫోన్ కనిపిస్తే చాలు.. వీడియో

ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తే ఇలాగే పగుల్తది..
