సంగీత్ వేడుకలో డ్యాన్స్ అదరగొట్టిన యువతి.. కానీ, ఒక్కసారిగా..
మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవరూ చెప్పలేరు. అప్పటివరకు ఎంతో ఆనందంగా ఉన్న వ్యక్తి సడెన్ గా మృత్యు ఒడికి చేరతాడు. ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. తాజాగా మధ్యప్రదేశ్ లో అలాంటి సంఘటన చోటు చేసుకుంది. అప్పటివరకు స్టేజ్ పై ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్న యువతి సడెన్ గా కుప్పకూలింది. ఆ వెంటనే మరణించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పెళ్లి సందర్భంగా ఓ ఇంట్లో గ్రాండ్‌గా సంగీత్ కార్యక్రమం జరుగుతోంది.
ఈ వేడుకలో ఓ యువతి అద్భుతంగా డ్యాన్స్ చేసింది. డాన్స్ చేస్తూనే ఒక్కసారిగా కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్‌లోని విదిషలో జరిగింది. ఆ యువతిని పరిణీత జైన్ గా గుర్తించారు. ఆమె ఇండోర్ లో నివాసం ఉంటోంది. ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ లో భాగంగా సంగీత్ ఏర్పాటు చేశారు. తన సోదరి వివాహం సందర్భంగా స్టేజీపై డ్యాన్స్ చేస్తూ ఆమె కుప్పకూలి కింద పడిపోయింది. దీంతో వెంటనే ఆమెను.. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆ యువతి ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో సంబరాలు జరగాల్సిన పెళ్లింట్లో తీవ్ర విషాదం నెలకొంది. అప్పటివరకు ఆకట్టుకునే విధంగా డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొన్నేళ్ల క్రితం.. పరిణిత సోదరుడు కూడా గుండెపోటుతోనే మరణించాడు. అప్పుడు అతని వయస్సు కేవలం 12 ఏళ్లు.
మరిన్ని వీడియోల కోసం :
స్పీడ్ బోటులో షికారు చేస్తున్న పర్యాటకులు..నది మధ్యలోకి వెళ్లగానే..
భార్యను పాము కాటు వేసిన ప్రాంతానికి వెళ్లిన భర్త..అంతలోనే ఊహించని షాక్ వీడియో
అలసిపోయి చెట్టు కింద కూర్చొన్న సింహం.. తర్వాత ఏం జరిగిందంటే వీడియో
ఈ సారు మామూలోడు కాదు.. సర్కారు ఆఫీస్‌లోనే ఏకంగా మకాం పెట్టాడు…
భార్య కోసం రూ. 15 లక్షలతో రైల్వే ఉద్యోగం కొని.. విడిపోవడంతో.. వీడియో

ఎండతాపాన్ని తట్టుకోలేకపోయిన పాము..పాపం ఇలా..వీడియో

బ్రో.. నీ ఐడియా సూపర్..వీడియో

నడి సముద్రంలో తప్పిపోయిన మత్స్యకారుడు 95 రోజుల తర్వాత.. వీడియో

అతనంటే పాములకు ఎందుకంత పగ..వెంటాడి మరీ వీడియో

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!
