Black Ring: ఆకాశంలో బ్లాక్ రింగ్-మాస్కో వాసుల్లో భయం భయం.. సోషల్ మీడియాను ఊపేస్తున్న వీడియో..
ఆకాశంలో ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చిన తర్వాత ఈ నల్లని రింగ్ క్రమంగా పెరుగుతూ రావడం కనిపించిందన్నది స్థానికుల కథనం. సోషల్ మీడియా ఇప్పుడు ఈ బ్లాక్ రింగ్ తెగ వైరల్ అవుతోంది.
ఆకాశంలో నల్లటి పొగతో కూడిన ఈ రింగ్ ఇప్పుడు రష్యాలోని మాస్కో వాసుల్ని బెంబేలెత్తిస్తోంది. మాస్కో నగరంలోని స్పుత్నిక్ అనే బిల్డింగ్ సమీపంలో షూట్ చేసిన వీడియో ఇది. ఆకాశంలో ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చిన తర్వాత ఈ నల్లని రింగ్ క్రమంగా పెరుగుతూ రావడం కనిపించిందన్నది స్థానికుల కథనం. సోషల్ మీడియా ఇప్పుడు ఈ బ్లాక్ రింగ్ తెగ వైరల్ అవుతోంది. యుక్రెయిన్ హోం శాఖ సలహాదారు అంటోన్ గెర్షాంకో ట్వీట్ చేసిన ఈ వీడియోను ఇప్పటి వరకు సమారు రెండున్నర మిలియన్ల మంది చూశారు. మొదట్లో దట్టమైన పొగతో కనిపించిన ఈ రింగ్.. వీడియో చివరికి వచ్చేసరికి క్రమంగా పొగ తగ్గుతుండటం కనిపిస్తోంది. దీంతో పాటు మరిన్ని క్లిప్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్టు న్యూస్ వీక్ వెబ్ సైట్ పేర్కొంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jr.NTR – Ram Charan: కనిపించని దోస్తాన్.! చెర్రీ బర్త్‌డేకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు..?
Viral Video: రూ.80 లక్షలు ఇస్తానన్నా ఆమె ఒప్పుకోలేదు..
Rashmika Mandanna: ఇక ఆ డ్యాన్స్ చేయను..! నెటిజన్ ప్రశ్నకు రష్మిక సమాధానం..