Viral Video: ప్రకృతిలో ఏ జీవి ప్రాణమైనా ఒకటేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే చిన్న జీవుల ప్రాణం విషయంలో మాత్రం కాస్త తక్కువ భావంతో ఉంటాం. మనుషుల ప్రాణానికి ఇచ్చినంత ప్రాధాన్యతను మూగజీవులకు ఇవ్వం.. ఇది ఎవరూ కాదనలేని నిజం. అయితే ఇటీవల జరిగిన ఓ సంఘటన మాత్రం ప్రాణం ఎవరిదైనా ఒకటే అని చాటి చెబుతోంది. ఓ పక్షి ప్రాణాన్ని కాపాడేందుకు ఏకంగా హెలికాప్టర్‌నే రంగంలోకి దింపిన సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేయడంతో పాటు మానవత్వానికే సరికొత్త అర్థం చెబుతోంది.
వివరాల్లోకి వెళితే.. ఓ పక్షి గాల్లో ఎగురుతూ హెటెన్షన్ వైర్‌కు చిక్కుకుంది. రెక్కలు వైర్‌కు ఇరుక్కుపోవడంతో చాలా సేపటి వరకు పక్షి వైర్‌కే కొట్టిమిట్టాడింది. దీంతో ఇది గమనించిన అధికారులు కొందరు ఏకంగా హెలికాప్టర్‌ను రంగంలోకి దింపారు. హెలికాప్టర్ వైర్ ఉన్న చోటుకు వెళ్లిన తర్వాత.. అందులో నుంచి ఓ వ్యక్తి హెలికాప్టర్‌కు అమర్చిన స్టాండ్‌పై కూర్చొని పక్షిని క్షేమంగా బయటకు తీశాడు. తన ప్రాణాన్ని రిస్క్ చేసి మరీ పక్షి ప్రాణాన్ని కాపాడాడు.
దీనంతటినీ అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కొందరు వారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మనుషుల్లో మానవత్వానికి ఇది గొప్ప ఉదాహరణ అని కొందరు కామెంట్ చేస్తుండగా, మరికొందరు చిన్న ప్రాణమని వదిలేయకుండా ఎంతో రిస్క్ చేసి కాపాడిన వారి మనసు చాలా గొప్పదంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ సంఘటన ఎక్కడ జరిగిందన్నదానిపై మాత్రం స్పష్టత లేదు. సోషల్ మీడియాలో వస్తోన్న కామెంట్ల ప్రకారం అమెరికాలో 2013లో జరిగినట్లు తెలుస్తోంది. అయితే తాజాగా మళ్లీ ఈ వీడియో వైరల్‌గా మారింది. మరి ఈ వైరల్ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
View this post on Instagram
Also Read: