King Cobra: ఇంట్లో దూరి బయటకు రానంటున్న కింగ్ కోబ్రా.. చూస్తేనే హడలిపోయే అంత సైజు..
వేసవి వచ్చిందంటే చాలు ఎండ వేడికి తట్టుకోలేక పాములు బొరియల నుంచి బయటకు వస్తాయి. వేసవి తాపం తట్టుకోలేక చల్లదనం కోసం పాములు ఇళ్లలోకి వచ్చేస్తుంటాయి. తరచూ అలాంటి వీడియోలు నెట్టింట వైరల్ అవుతూనే ఉంటాయి.
ఈ వీడియోలో ఒక పెద్ద కింగ్ పశువుల కొట్టంలోకి ప్రవేశించింది. పశువుల కొట్టాం బయట ఓ వైపు ఆవు, మరోవైపు మేక కట్టేసి ఉన్నాయి. పామును గమనించిన యజమాని స్నేక్ క్యాచర్‌కు, అటవీ సిబ్బందికి సమాచారమిచ్చారు. రంగంలోకి దిగిన వారు ఆ రాచనాగును బంధించేందుకు అష్టకష్టాలూ పడ్డారు. ఎంత ప్రయత్నించినా నేను రాను బాబోయ్ అన్నట్టుగా మొండికేసింది. మొత్తానికి అతి కష్టంమీద 16 అడుగుల పొడవైన కింగ్ కోబ్రాను బంధించారు. అంత పెద్ద పామును చూసి స్థానికులు తీవ్ర భయాందోళన చెందారు. ఈ వీడియోను ఓ యూజర్ ట్విట్టర్‌లో షేర్ చేస్తూ ‘గోశాలలో 16 అడుగుల కింగ్ కోబ్రా.. అతికష్టంతో బంధించిన అటవీశాఖ’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్ విషయంలో అది ఫేక్ న్యూస్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.
Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!