AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పైకి చెట్టే.. లోపల చూస్తే అదిరిపడతారు..

Viral Video: పైకి చెట్టే.. లోపల చూస్తే అదిరిపడతారు..

Phani CH
|

Updated on: Aug 01, 2023 | 9:20 PM

Share

ఐడియా ఉండాలే కానీ బ్రతకడానికి అనేక మార్గాలు. అందుకు ఉదాహరణే ఈ వీడియో. అమృత్‌సర్‌లో ఓ వృద్ధుడు ఓ టీ స్టాల్‌ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇందులో విశేషమేముంది అనుకుంటున్నారా.. ఉంది. అతను ఏ షాపింగ్‌ మాల్‌లోనో, సినిమా థియేటర్‌ వద్దో లేదా హోటల్‌లోనో టీ స్టాల్‌ నడపడంలేదు. స్వచ్ఛమైన ప్రకృతి ఒడిలో టీస్టాల్‌ పెట్టి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు.

ఐడియా ఉండాలే కానీ బ్రతకడానికి అనేక మార్గాలు. అందుకు ఉదాహరణే ఈ వీడియో. అమృత్‌సర్‌లో ఓ వృద్ధుడు ఓ టీ స్టాల్‌ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇందులో విశేషమేముంది అనుకుంటున్నారా.. ఉంది. అతను ఏ షాపింగ్‌ మాల్‌లోనో, సినిమా థియేటర్‌ వద్దో లేదా హోటల్‌లోనో టీ స్టాల్‌ నడపడంలేదు. స్వచ్ఛమైన ప్రకృతి ఒడిలో టీస్టాల్‌ పెట్టి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు. అతను ఓ చెట్టు లోపల టీ స్టాల్‌ నిర్వహిస్తున్నాడు. చెట్టు లోపల టీ స్టాల్‌ ఏంటండి బాబు అనుకుంటున్నారా.. మీరు విన్నది నిజమే.. అదెలాగో మీరే చూడండి. అమృత్‌సర్‌లో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. గోల్డెన్‌ టెంపుల్‌ను ప్రముఖంగా చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడికి వెళ్లినవారు తప్పక ఈ టీస్టాల్‌ని సందర్శిస్తారు. అక్కడ టీ ని ఆస్వాదిస్తారు కూడా. ఇక అసలు విషయం ఏంటంటే.. మర్రి చెట్టు గురించి మీ అందరికీ తెలిసిందే. అది ఊడలు వేసిందంటే చుట్టుపక్కలను చిన్న చిన్నచెట్లను కూడా తనలో కలిపిఏసుకుంటుంది. అలాంటి మర్రి చెట్టును చాలా తెలివిగా ఆ పెద్దాయన తన టీస్టాల్‌కు ఉపయోగించుకున్నారు. ఆ మర్రి చెట్టు ఊడలతో ఓ గుడారంలా ఏర్పడింది. దానిని జాగ్రత్తగా దుకాణం నడుపుకునేందుకు వీలుగా మలచుకుని, 40 ఏళ్లుగా అందులో టీస్టాల్‌ నడుపుతున్నాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పురి విప్పి నాట్యం ఆడిన నెమలి.. ఆ రైతు ఏంచేశాడంటే ??

అయ్యో.. ఈ కుక్కకు వచ్చిన కష్టం ఎవరికీ రాకూడదు..

కాలువలో ఈత కొడుతున్న గేదెలు.. అంతలో ఊహించని షాక్‌

Hampi: ఏఐ ఫొటోలలో అద్భుతంగా అలనాటి హంపి !!

ఏడుపు మారథాన్‌.. అంతకంటె ఏడవలేకపోయాడు