అగ్గి రాజేసిన సిగరెట్ పీక.. 44 వాహనాలు దగ్ధం

సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరం.. ఇది అందరికీ తెలిసిందే.. అయితే ఎక్కడపడితే అక్కడ సిగరెట్ కాల్చి పడేయడం మరింత ప్రమాదకరం. సిగరెట్ కాల్చినప్పుడు చివరగా ఉండే చిన్న ముక్కను అజాగ్రత్తగా పడేయడం పెను ప్రమాదానికి కారణమవుతోంది. తాజాగా రామచంద్రాపురంలో ఇలాంటి ఘటనే జరిగింది. కొందరు వ్యక్తులు కాల్చి పారేసిన సిగరెట్ పీకలతో మంటలు చెలరేగి పదుల సంఖ్యలో వాహనాలు కాలి బూడిదయ్యాయి.

అగ్గి రాజేసిన సిగరెట్ పీక.. 44 వాహనాలు దగ్ధం

|

Updated on: Feb 01, 2024 | 8:07 PM

సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరం.. ఇది అందరికీ తెలిసిందే.. అయితే ఎక్కడపడితే అక్కడ సిగరెట్ కాల్చి పడేయడం మరింత ప్రమాదకరం. సిగరెట్ కాల్చినప్పుడు చివరగా ఉండే చిన్న ముక్కను అజాగ్రత్తగా పడేయడం పెను ప్రమాదానికి కారణమవుతోంది. తాజాగా రామచంద్రాపురంలో ఇలాంటి ఘటనే జరిగింది. కొందరు వ్యక్తులు కాల్చి పారేసిన సిగరెట్ పీకలతో మంటలు చెలరేగి పదుల సంఖ్యలో వాహనాలు కాలి బూడిదయ్యాయి. సంగారెడ్డి జిల్లా సరిహద్దు లింగంపల్లి జంక్షన్ పోలీస్‌ క్వార్టర్స్‌లో రామచంద్రాపురం, చందానగర్‌ పోలీస్ స్టేషన్ లకు సంబంధించి వివిధ కేసుల్లోని వాహనాలను ఉంచారు. చాలా రోజులుగా అవి అక్కడే ఉండటంతో వాటి చుట్టూ పిచ్చిమొక్కలు పెరిగి ఎండిపోయాయి. ఈ సమయంలో కొందరు వ్యక్తులు అక్కడ సిగరెట్లు కాల్చారు. అనంతరం సిగరెట్‌ పీకలను ఇ మొక్కల్లోకి విసిరారు. అవి క్రమేపీ అగ్గి రాజుకుని మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో 36 బైక్‌లు, 8 కార్లు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్‌ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. రెండు ఫైర్ ఇంజిన్‌ల సహాయంతో మంటలు ఆర్పారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రన్‌వేపై ల్యాండవుతూ కారుపై కుప్పకూలిన విమానం

హాస్టల్‌లోనే బార్‌ ఓపెన్‌ చేసేసాడు.. అంతటితో ఆగక ??

అందుబాటులోకి వచ్చిన వేల ఏళ్లనాటి గుహలు !! వాల్మికి రామాయణం రాసిన చోటు ఇదేనా ??

పొలాల్లో కోతుల బెడదకు కొండముచ్చులతో చెక్‌

Follow us