4 టన్నుల డైనమైట్.. 40 అంతస్తులు.. 9 సెకెన్లలో ఢాం..నేలపై కుషన్లు.! వీడియో చుస్తే మతి పోవాల్సిందే..
మే 22న 40 అంతస్తుల ట్విన్ టవర్స్ కుప్పకూలనున్నాయి.. అందుకోసం 4 టన్నుల పేలుడు పదార్థాలు వినియోగిస్తున్నారు. అయితే రెండు భవనాలు కూల్చడం కోసం పట్టే సమయం కేవలం 9 సెకన్లే. ఉత్తర్‌ప్రదేశ్‌లోని నొయిడా సెక్టార్ 93 ప్రాంతంలో సూపర్ టెక్ కంపెనీ 2009లో భారీ ప్రాజెక్టు చేపట్టింది.
మే 22న 40 అంతస్తుల ట్విన్ టవర్స్ కుప్పకూలనున్నాయి.. అందుకోసం 4 టన్నుల పేలుడు పదార్థాలు వినియోగిస్తున్నారు. అయితే రెండు భవనాలు కూల్చడం కోసం పట్టే సమయం కేవలం 9 సెకన్లే. ఉత్తర్‌ప్రదేశ్‌లోని నొయిడా సెక్టార్ 93 ప్రాంతంలో సూపర్ టెక్ కంపెనీ 2009లో భారీ ప్రాజెక్టు చేపట్టింది. అయితే భవనాల నిర్మాణం విషయంలో రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్‌కు ప్రణాళికను చూపాలన్న నిబంధనను బిల్డరు పెడచెవిన పెట్టారు. దీంతోపాటు అధికారులతో కుమ్మక్కై నిబంధనలు పాటించలేదు. దీనిపై స్థానికంగా ఉన్న నలుగురు వ్యక్తులు.. ఓ లీగల్ కమిటీగా ఏర్పడి సూపర్‌టెక్‌కు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించారు. ఇరు వర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు 40 అంతస్తుల ట్విన్ టవర్స్ కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేసింది. అందులో 915 ఫ్లాట్లు, 21 దుకాణాలు ఉన్నాయి. వీటి కూల్చివేతకు మే 22 మధ్యాహ్నం 2.30 గంటలకు సమయం ఫిక్స్ చేశారు. స్థానిక అధికారులు ఆ బాధ్యతను ఎడిఫైస్ ఇంజినీరింగ్ సంస్థ చేతిలో పెట్టారు. అలాగే ఈ టవర్స్‌ను కూల్చివేసేందుకు 2,500 నుంచి 4,000 కిలోల పేలుడు పదార్థాలు అవసరమవుతాయని అంచనా. అంతటి భారీ నిర్మాణాల కూల్చివేతకు కేవలం 9 సెకన్ల సమయం మాత్రమే పడుతుందని సంస్థ అధికారులు తెలిపారు.ముందుగా ట్రయల్ బ్లాస్ట్ కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. కూల్చివేత వల్ల కలిగే ప్రకంపనలు తగ్గించేందుకు నేలపై కుషన్లు అమర్చనున్నారు. ఇక ట్విన్ టవర్స్‌కు దగ్గర్లో వందల సంఖ్యలో కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ పేలుళ్ల కారణంగా ఇతర భవనాలకు ఎలాంటి హాని జరగదని నిపుణులు హామీ ఇచ్చారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
viral Video: ఇంటి అద్దె కట్టలేక ఆఫీసులోనే మకాం పెట్టేసాడు.. తర్వాత ఏమైందంటే..?
NTR-Ram Charan-RRR: ఒకరు మన్యం ధీరుడు.. మరొకరు గిరిజన వీరుడు.. రామ్ భీమ్‌ల మధ్య స్నేహం..