Danger Corona Variants: మరో 2డెంజర్ వేరియంట్స్‌తో కరోనా..! భయం గుప్పిట్లో ప్రపంచం.. పూర్తి వివరాలు ఇక్కడ..

Danger Corona Variants: మరో 2డెంజర్ వేరియంట్స్‌తో కరోనా..! భయం గుప్పిట్లో ప్రపంచం.. పూర్తి వివరాలు ఇక్కడ..

Anil kumar poka

|

Updated on: Mar 30, 2022 | 9:03 PM

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ఈ క్రమంలో ఫోర్త్ వేవ్ ప్రమాదం పొంచిఉన్నట్లు ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరిస్తోంది. గత రెండేళ్లుగా కుదిపేసిన కరోనా మహమ్మారి ముప్పు ఇక తప్పినట్లేనని అనుకుంటున్న క్రమంలో కొత్త వేరియంట్స్‌ అలజడి సృష్టిస్తున్నాయి.


ప్రపంచ వ్యాప్తంగా కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ఈ క్రమంలో ఫోర్త్ వేవ్ ప్రమాదం పొంచిఉన్నట్లు ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరిస్తోంది. గత రెండేళ్లుగా కుదిపేసిన కరోనా మహమ్మారి ముప్పు ఇక తప్పినట్లేనని అనుకుంటున్న క్రమంలో కొత్త వేరియంట్స్‌ అలజడి సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో ఇజ్రాయిల్‌లో కోవిడ్ వేరియంట్‌ కొత్త కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. కోవిడ్-19 వైరస్‌.. ఒమిక్రాన్ తోపాటు దాని ఉప వేరియంట్లు BA.1, BA.2గా రూపాంతరం చెందుతున్నాయి. ఈ క్రమంలో ఇజ్రాయిల్‌లో రెండు కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఇజ్రాయిల్ బెన్ గురియన్ విమానాశ్రయానికి చేరుకున్న ఇద్దరు ప్రయాణీకులకు ఆర్టీపీసీఆర్ టెస్ట్‌ చేయగా.. BA.1, BA.2 వేరియంట్లు వెలుగులోకి వచ్చినట్లు ఇజ్రాయెల్‌ ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. పరీక్షల్లో ఒమిక్రాన్‌ ఉప వేరియంట్‌లు ఉన్నట్లు వివరించారు. ఈ రెండు వేరియంట్లు కలిగిన ఇద్దరు వ్యక్తులకు జ్వరం, తలనొప్పి, కండరాల బలహీనత వంటి తేలికపాటి లక్షణాలన్నట్లు పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఈ కొత్త వేరియంట్ కేసుల గురించి ఇప్పటివరకు తెలిదని చెప్పింది. దీనిగురించి అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇజ్రాయెల్ పాండమిక్ రెస్పాన్స్ చీఫ్, సల్మాన్ జర్కా అన్నారు. కాగా.. ఇజ్రాయెల్ లోని 9.2 మిలియన్ల జనాభాలో నాలుగు మిలియన్లకు పైగా ప్రజలు కరోనావైరస్ వ్యాక్సిన్ మూడు డోసులను పొందినట్లు తెలిపారు.

మరిన్ని చూడండి ఇక్కడ:

Viral Video: ఓరి వీడి దుంపతెగ.. ఎంత పని చేసాడు.. రోగిని పట్టుకొని అర్జున్ రెడ్డి సీన్ రిపీట్ చేసాడు..

viral Video: ఇంటి అద్దె కట్టలేక ఆఫీసులోనే మకాం పెట్టేసాడు.. తర్వాత ఏమైందంటే..?

NTR-Ram Charan-RRR: ఒకరు మన్యం ధీరుడు.. మరొకరు గిరిజన వీరుడు.. రామ్ భీమ్‌ల మధ్య స్నేహం..

Python Viral Video: బాబోయ్‌ భారీ కొండచిలువ..! వయ్యారి నడక చూస్తే వణుకే.. ఇలాంటి వీడియో చేస్తే తట్టుకోలేరు..

Kajal Aggarwal: పంచదార బొమ్మ ‘కాజల్ అగర్వాల్’ మరోసారి అదిరిపోయే బేబీ బంప్‌ ఫొటోలను ఫ్యాన్స్‌తో పంచుకుంది..

Viral Video: రష్యా సైనికులకు ఓ ‘మోడల్‌’ ఆఫర్‌.. పుతిన్‌ను ఎదిరించిన వారికి పడక సుఖాన్ని అందిస్తా..! (వీడియో)

Published on: Mar 30, 2022 08:46 PM