రూ.కోటి ధర పలికే అరుదైన పాము.. ఎక్కడుందంటే ??
అంతరించిపోయే దశలో ఉన్న ఓ పామును అమ్మేందుకు ప్రయత్నించారు దుండగులు.. చాకచక్యంగా నలుగురు స్మగ్లర్లను అటవీశాఖ అధికారులకు చిక్కడంతో అసలు బండారం బయటపడింది.
అంతరించిపోయే దశలో ఉన్న ఓ పామును అమ్మేందుకు ప్రయత్నించారు దుండగులు.. చాకచక్యంగా నలుగురు స్మగ్లర్లను అటవీశాఖ అధికారులకు చిక్కడంతో అసలు బండారం బయటపడింది. బెంగాల్‌లోని సిలిగుడిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుల నుంచి ‘రెడ్‌శాండ్ బోవా’ అనే అరుదైన జాతికి చెందిన సర్పాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్లాక్‌మార్కెట్‌లో దీని ధర కోటి రూపాయల వరకు పలుకుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ పామును బీహార్ నుంచి తీసుకొచ్చినట్లు నిందుతులు తెలిపారు. బైకాంతపుర్ ఫారెస్ట్ డివిజన్‌లోని ఓ ఇంట్లో దీన్ని ఉంచినట్లు సమాచారం అందగానే.. బేలాకోబా రేంజ్ అధికారి సంజయ్‌దత్తా నేతృత్వంలోని బృందం స్మగ్లర్లపై దాడి చేసింది. నాలుగున్నర అడుగులు ఉన్న పామును స్వాధీనం చేసుకుంది. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
థమ్స్‌అప్‌తో పానీపూరీ చేస్తున్న వీధివ్యాపారి.. టేస్ట్ అదిరింది అంటున్న నెటిజన్లు
జై కొట్టిన 16వేల మంది.. వరల్డ్ బిగ్ స్క్రీన్ పై RRR
Allu Arjun: తెలుగోడి సత్తా.. సౌత్ ఇండియా మొత్తంలో ఒకే ఒక్క హీరో అల్లు అర్జున్
Salaar: రిలీజ్ కాకముందే డార్లింగ్ దిమ్మతిరిగే రికార్డ్ !!
Jr NTR: దిగివచ్చిన HCA !! తారక్ కోసం స్పెషల్ అవార్డ్ !!