Crime: స్నేహితుడి మర్మాంగంలోకి ఎయిర్‌ బ్లో చేశాడు.. సరదా ఆట ప్రాణం తీసింది.

Crime: స్నేహితుడి మర్మాంగంలోకి ఎయిర్‌ బ్లో చేశాడు.. సరదా ఆట ప్రాణం తీసింది.

Anil kumar poka

|

Updated on: Mar 30, 2024 | 4:34 PM

ఇద్దరు స్నేహితులు సరాదాగా ఆడిన ఆటలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఎయిర్ బ్లోయర్‌తో ఆటలు ఓ యువకుడి ప్రాణాలను బలిగొన్న ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నగరంలోని సంపెగహళ్లి ప్రాంతానికి చెందిన యోగేశ్ అనే 24 ఏళ్ల యువకుడు, మార్చి 25న స్థానిక వాషింగ్ సెంటర్‌లో పని చేస్తున్న తన స్నేహితుడు మురళి వద్దకు వెళ్లాడు.

ఇద్దరు స్నేహితులు సరాదాగా ఆడిన ఆటలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఎయిర్ బ్లోయర్‌తో ఆటలు ఓ యువకుడి ప్రాణాలను బలిగొన్న ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నగరంలోని సంపెగహళ్లి ప్రాంతానికి చెందిన యోగేశ్ అనే 24 ఏళ్ల యువకుడు, మార్చి 25న స్థానిక వాషింగ్ సెంటర్‌లో పని చేస్తున్న తన స్నేహితుడు మురళి వద్దకు వెళ్లాడు. సర్వీసింగ్ కోసం తన బైక్‌ను అతడికి ఇచ్చాడు. ఆ తరువాత.. బండిపై నీటిని తొలగించే హాట్ ఎయిర్ బ్లోయర్‌తో ఇద్దరూ ఆటలు ప్రారంభించారు. మొదట మురళి ఎయిర్ బ్లోయర్‌తో యోగేశ్ ముఖంపై గాలి కొట్టాడు. ఆ తరువాత అతడి మర్మాంగంలోకి బ్లోయర్ నాజిల్‌ను చొప్పించి ఆన్ చేశాడు. దీంతో, యోగేశ్ కడుపు ఒక్కసారిగా ఉబ్బిపోయి అతడు కూలబడిపోయాడు. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించగా డాక్టర్లు శస్త్రచికిత్స చేశారు. చివరకు అతడి ఆరోగ్యం మరింతగా విషమించి మృతి చెందాడు. కాగా, నిందితుడు మురళిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..