ISRO Rubidium Atomic Clock: త్వరలో భారత్‌లోని గడియారాలన్నీ ఇస్రో టైం ప్రకారమే.!
భారత్‌లో సాంకేతిక స్వావలంబన దిశగా మరో కీలక అడుగు పడింది. త్వరలో దేశంలోని అన్ని గడియారాలు, స్మార్ట్ ఫోన్, కంప్యూటర్లతో సహా అన్నీ ఇస్రో రూపొందించిన రుబీడియం అటామిక్ క్లాక్ ప్రకారం పనిచేయనున్నాయి. ఈ దిశగా త్వరలో గడియారాలన్నీఈ అటామిక్ క్లాక్‌తో సింక్ చేయనున్నారు. ప్రస్తుతం భారత్‌లోని వ్యవస్థలు అమెరికా రూపొందించిన నెట్‌వర్క్ టైం ప్రొటోకాల్‌ను అనుసరిస్తున్నాయి.
భారత్‌లో సాంకేతిక స్వావలంబన దిశగా మరో కీలక అడుగు పడింది. త్వరలో దేశంలోని అన్ని గడియారాలు, స్మార్ట్ ఫోన్, కంప్యూటర్లతో సహా అన్నీ ఇస్రో రూపొందించిన రుబీడియం అటామిక్ క్లాక్ ప్రకారం పనిచేయనున్నాయి. ఈ దిశగా త్వరలో గడియారాలన్నీఈ అటామిక్ క్లాక్‌తో సింక్ చేయనున్నారు. ప్రస్తుతం భారత్‌లోని వ్యవస్థలు అమెరికా రూపొందించిన నెట్‌వర్క్ టైం ప్రొటోకాల్‌ను అనుసరిస్తున్నాయి. ఇస్రో గతేడాది రూబీడియం క్లాక్‌ను రూపొందించింది. స్వదేశీ ఉపగ్రహ నావిగేషన్ వ్యవస్థ నావిక్‌లో దిన్ని తొలిసారిగా ఉపయోగించారు. నావిక్‌లోని తొలి తొమ్మిది ఉపగ్రహాలను 2013 నుంచి 2023 మధ్య లాంచ్ చేయగా వాటిలో..విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న రుబీడియం అటామిక్ క్లాక్స్‌నే ఉపయోగించారు. అయితే, గతేడాది మేలో ప్రయోగించిన పదో ఉపగ్రహంలో మాత్రం ఇస్రో రూపొందించిన అటామిక్ క్లాక్‌ను వినియోగించారు. ఈ క్రమంలో దేశంలోని అన్ని గడియారాలను ఈ క్లాక్ టైంతో త్వరలో సింక్ కానున్నాయి. అటమిక్ గడియారాలు అత్యంత కచ్చితత్వంతో సమయాన్ని కొలుస్తాయి. అందుకే నావిగేషన్ ఉపగ్రహాల్లో కూడా ఈ అటామిక్ గడియారాలనే ఉపయోగిస్తారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా వినియోగిస్తున్న అటామిక్ గడియారాల్లో సీసియం అణువులను ఉపయోగిస్తున్నారు. ఈ గడియారంలో రుబీడియం అణువులను వినియోగించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.