స్కూల్ కింద 2వేల బాంబులు.. జస్ట్‌ మిస్.. లేదంటే ??

స్కూల్ కింద 2వేల బాంబులు.. జస్ట్‌ మిస్.. లేదంటే ??

Phani CH

|

Updated on: Aug 17, 2023 | 10:11 PM

ఆ స్కూల్ లో వెయ్యి మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. బిల్డింగ్ సరిపోవట్లేదని కొత్త బ్లాక్ కట్టేందుకు యాజమాన్యం నిర్ణయించింది. పునాదులు కూడా తవ్వింది. అంతలోనే ఓ వార్త కలకలం రేపింది. పునాదులు తవ్వుతుండగా ఒక్కటొక్కటిగా ఆయుధాలు, మందుపాతరలు, రాకెట్ లాంచర్లు బటయపడ్డాయి. అదికూడా ఒకటి రెండూ కాదు ఏకంగా 2వేలు పైనే బయటపడ్డాయి. దాంతో భయాందోళనకు గురైన యాజమాన్యం అప్రమత్తమై అధికారులకు సమాచారం అందించారు.

ఆ స్కూల్ లో వెయ్యి మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. బిల్డింగ్ సరిపోవట్లేదని కొత్త బ్లాక్ కట్టేందుకు యాజమాన్యం నిర్ణయించింది. పునాదులు కూడా తవ్వింది. అంతలోనే ఓ వార్త కలకలం రేపింది. పునాదులు తవ్వుతుండగా ఒక్కటొక్కటిగా ఆయుధాలు, మందుపాతరలు, రాకెట్ లాంచర్లు బటయపడ్డాయి. అదికూడా ఒకటి రెండూ కాదు ఏకంగా 2వేలు పైనే బయటపడ్డాయి. దాంతో భయాందోళనకు గురైన యాజమాన్యం అప్రమత్తమై అధికారులకు సమాచారం అందించారు. తవ్వకాలు చేపట్టిన అధికారులు అసలు విషయం బయటపెట్టారు. కంబోడియా ఈశాన్య ప్రాంతంలోని క్రాంటీ ప్రావిన్స్ లో క్వీన్ కోసామక్ హైస్కూల్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. అప్రమత్తమైన కంబోడియన్ మైన్ యాక్షన్ సెంటర్ తవ్వకాలు జరిపింది. దాంతో 2116 పేలని బాంబులు దొరికాయి. అందులో ఎం70 గ్రెనేడ్లు, ఫ్యూజ్‌ఎం48 బాంబులు, బీ40 రాకెట్‌ లాంచర్లు ఉన్నాయి. ఇవే కాకుండా స్కూల్ కింద మరిన్ని దొరికే అవకాశం ఉందని భావించిన స్కూల్‌ యాజమాన్యం పాఠశాలకు కొన్నిరోజులు తాత్కాలిక సెలవులు ప్రకటించింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

జిమ్‌లో విరాట్‌ కోహ్లీ వర్కవుట్స్‌ చూస్తే అదిరిపడతారు

పేలిన పార్క్ చేసిన స్కూటర్.. అర్థరాత్రి పరుగో పరుగు!

ప్రియురాలిని బైక్‌పైనుంచి తోసేసి యువకుడు పరార్‌..ఏం జరిగిందంటే ??

కరెంట్‌ స్విచ్‌బోర్డ్‌లో దొరికిన 15 కోట్ల విలువైన వజ్రం

క్రికెట్‌లో మెరుపులు కురిపిస్తున్న పోలీస్‌ !! బౌలింగ్‌తో బ్యాటర్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేసిన పోలీసు