చెవి ఇన్ఫెక్షన్ అని మందులు ఇచ్చారు .. పాపం కొద్ది రోజుల్లోనే..

Updated on: Mar 07, 2025 | 5:21 PM

చెవి నొప్పి, తల తిరగడం, మాటలు స్పష్టంగా రాకపోవడం.. ఇలాంటి లక్షణాలను మనం పెద్దగా పట్టించుకోం.. కానీ అదే తీవ్రమైన సమస్యగా మారి అత్యవసర పరిస్థితికి దారి ప్రాణాలను కూడా తీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్రిటన్‌లో ఓ 19 ఏళ్ల యువకుడు చనిపోయాడు. చెవి ఇన్ఫెక్షన్‌గా భావించిన డాక్టర్ నిర్లక్ష్యంతో .. కొన్ని నెలల్లోనే అది సాధారణ వ్యాధి కాదని, బ్రెయిన్ ట్యూమర్ అని కనుగొన్న ఒక యువకుడి కథ నేడు అందరినీ ఆలోచింపజేస్తోంది.

డైలీ మెయిల్‌ పత్రిక కథనం ప్రకారం.. 19 ఏళ్ల జాక్ సెక్స్టన్ డెత్ స్టోరీ బ్రిటన్‌లో సంచలనం సృష్టించింది . 2024 అక్టోబర్‌లో.. అతను తలతిరగడం, దృష్టిలో మార్పులు, మాట్లాడటంలో ఇబ్బంది లక్షణాలను వైద్యులు చెవి ఇన్ఫెక్షన్‌గా తోసిపుచ్చారు. కానీ నాలుగు నెలల తర్వాత అతని మరణం ఓ సందేశాన్ని ఇచ్చింది. జాక్ కు గ్లియోబ్లాస్టోమా అనే బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. అది ప్రాణాంతక క్యాన్సర్లలో ఒకటి. చిన్న లక్షణాలను విస్మరించడం ఎంత ప్రమాదమో అతని కథ ఇప్పుడు ఇతరులకు ఒక పాఠంగా మారింది.జాక్ హెయిర్ డ్రెస్సర్‌గా పనిచేసాడు. మొదట్లో డాక్టర్ జ్వరంగా భావించి చెవి ఇన్ఫెక్షన్ కు మందు ఇచ్చారు. కొద్ది రోజుల్లోనే, అతని పరిస్థితి విషమించడంతో అతని తల్లి అతన్ని ప్రిన్స్ చార్లెస్ ఆసుపత్రికి తీసుకెళ్లింది.. అక్కడ స్కాన్‌లో జాక్ మెదడులో గ్లియోబ్లాస్టోమా ఉన్నట్లు తేలింది .

మరిన్ని వీడియోల కోసం :

మంటలు రేపనున్న మార్చినెల.. ఎండలతో జాగ్రత్త జర వీడియో

గంగానది మధ్యలో వంద మంది యాత్రికులు.. ఒక్కసారిగా నదీ ప్రవాహం పెరగడంతో…

తల్లి ప్రేమ రేంజ్ ఇదీ.. కుక్క దాడి నుంచి తల్లి రక్షణ కవచం ఏర్పాటు వీడియో

వామ్మో.. ఈ పాక్‌ యువతి సంపాదన చూస్తే షాకవుతారు నెలకు ఎంతంటే?వీడియో

Published on: Mar 07, 2025 05:21 PM