Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చరిత్ర సృష్టించిన చందమామపై బ్లూ ఘోస్ట్‌ .. వీడియో

చరిత్ర సృష్టించిన చందమామపై బ్లూ ఘోస్ట్‌ .. వీడియో

Samatha J

|

Updated on: Mar 07, 2025 | 5:11 PM

అంతరిక్ష పరిశోధకులు నిరంతరం పరిశోధనలు చేస్తూనే ఉంటారు. ఈ క్రమంలో చంద్రుడు, సూర్యుడు, మార్స్‌పైన ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు. చంద్రయాన్‌, ఆదిత్య ఎల్‌-1 ప్రయోగాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రుడిపై చేసే ప్రయోగాల్లో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. చరిత్రలో తొలిసారి ఓ ప్రైవేట్‌ సంస్థ తమ ల్యాండర్‌ను విజయవంతంగా చంద్రుడిపై దింపింది. గతంలో ఇతర పలు ప్రైవేట్‌ సంస్థలు చంద్రుడిపై ల్యాండర్‌ను సేఫ్‌గా దింపడంలో విఫలం అయ్యారు. చివరి దశలో అవి కూలిపోవడమో, పక్కకు ఓరిగిపోవడమే జరిగేవి. కానీ, అమెరికాలోని టెక్సాస్ కు చెందిన ఫైర్ ఫ్లై ఏరోస్పేస్ చరిత్ర సృష్టించింది.

బ్లూ ఘోస్ట్ అనే లూనార్ ల్యాండర్‌ను ఆదివారం జాబిల్లి ఉపరితలంపై సక్సెస్‌ఫుల్‌గా దించింది. చంద్రుడిపై కూలిపోకుండా, పడిపోకుండా సరిగ్గా ల్యాండర్ ను దించిన తొలి ప్రైవేట్ సంస్థగా ఫైర్ ఫ్లై ఏరోస్పేస్ నిలిచింది. బ్లూ ఘోస్ట్‌ ల్యాండర్‌ నాసాకు చెందిన 10 శాస్త్ర, సాంకేతిక పరికరాలతో ఆదివారం చందమామపై అడుగుపెట్టింది. దాదాపు 6.6 అడుగుల ఎత్తు, 11 అడుగుల వెడల్పున ఉండే ఈ ల్యాండర్‌ను జనవరి 15న ఫ్లోరిడాలోని కేప్‌కెనవరాల్‌ కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించారు. ఎలాన్ మస్క్‌కు చెందిన ఫాల్కన్‌ 9 రాకెట్‌, బ్లూ ఘోస్ట్‌తో పాటు జపాన్‌కు చెందిన మరో ల్యాండర్‌ హకుటో ఆర్‌2 కూడా నింగిలోకి మోసుకెళ్లింది. వీటిలో బ్లూ ఘోస్ట్‌ చందమామపై నిర్ణీత ల్యాండింగ్‌ సైట్‌కు 328 అడుగుల పరిధిలోనే ఇది ల్యాండ్‌ అయినట్టు ఫైర్‌ఫ్లై సంస్థ వెల్లడించింది.

మరిన్ని వీడియోల కోసం :

మంటలు రేపనున్న మార్చినెల.. ఎండలతో జాగ్రత్త జర వీడియో

గంగానది మధ్యలో వంద మంది యాత్రికులు.. ఒక్కసారిగా నదీ ప్రవాహం పెరగడంతో…

తల్లి ప్రేమ రేంజ్ ఇదీ.. కుక్క దాడి నుంచి తల్లి రక్షణ కవచం ఏర్పాటు వీడియో

వామ్మో.. ఈ పాక్‌ యువతి సంపాదన చూస్తే షాకవుతారు నెలకు ఎంతంటే?వీడియో