అంటార్కిటికాలో అరుదైన ఉల్క !! లక్షల ఏళ్ల నాటిది !!

అంటార్కిటికాలోని బ్లూఐస్‌ ప్రాంతంలో శాస్త్రజ్ఞులు 7.6 కిలోల బరువున్న ఉల్కను కనుగొన్నారు. ఈ తరహా ఉల్క అంతరిక్షంలోని గ్రహశకల మండలం నుంచి లక్షల సంవత్సరాల క్రితం భూమికి వచ్చి చేరింది.

అంటార్కిటికాలో అరుదైన ఉల్క !! లక్షల ఏళ్ల నాటిది !!

|

Updated on: Jan 28, 2023 | 8:12 AM

అంటార్కిటికాలోని బ్లూఐస్‌ ప్రాంతంలో శాస్త్రజ్ఞులు 7.6 కిలోల బరువున్న ఉల్కను కనుగొన్నారు. ఈ తరహా ఉల్క అంతరిక్షంలోని గ్రహశకల మండలం నుంచి లక్షల సంవత్సరాల క్రితం భూమికి వచ్చి చేరింది. ఇప్పుడు లభ్యమైన ఉల్కను శాస్త్రజ్ఞులు చేతితో తాకకుండా ఫోర్కుతో నేరుగా ప్లాస్టిక్‌ సంచిలోకి కానీ, అల్యూమినియం పొరలోకి కానీ తీసుకుని భద్రపరుస్తారు. శీతలీకరించిన పెట్టెలో దాన్ని బ్రస్సెల్స్‌కు పంపుతారు. అక్కడ దాని రసాయన స్వరూపాన్ని విశ్లేషిస్తారు. డిసెంబరు 11 నుంచి జనవరి 11 వరకు అంతర్జాతీయ శాస్త్రజ్ఞుల అన్వేషణలో తాజా ఉల్క బయటపడింది. ఈ ప్రాంతంలో గతంలో బెల్జియన్‌, జపనీస్‌ శాస్త్రజ్ఞులు 600 ఉల్కలను సేకరించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆకుపచ్చ తోకచుక్క భూమికి దగ్గరగా.. 50వేల సంవత్సరాల తర్వాత ఇలా !! మిస్‌ కాకండి

కారుకి బ్రేక్‌ వెయ్యబోతే సీన్‌ రివర్స్‌.. ఏంజరిగిందో చూడండి !!

ఏటీఎం చోరీకి వచ్చి దొంగ.. సీసీటీవీని చూస్తూ దేవుడ్ని ప్రార్థించి.. మొదలెట్టాడు..

ముల్లంగి ఆకులను పడేస్తున్నారా ఆరోగ్య ప్రయోజనాలను మిస్ అవుతున్నట్లే !!

అమ్మ బాబోయ్.. మళ్లీ ఎంటరయ్యారు.. చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్ !!

 

Follow us