కారుకి బ్రేక్ వెయ్యబోతే సీన్ రివర్స్.. ఏంజరిగిందో చూడండి !!
సొంత కారు కలిగి ఉండటాన్ని స్టేటస్ సింబల్‌గా చాలా మంది భావిస్తారు. అంతే కాకుండా ఎవరి కారును వారే నడిపేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే ఎంత జాగ్రత్తగా వాహనం నడిపినా..
సొంత కారు కలిగి ఉండటాన్ని స్టేటస్ సింబల్‌గా చాలా మంది భావిస్తారు. అంతే కాకుండా ఎవరి కారును వారే నడిపేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే ఎంత జాగ్రత్తగా వాహనం నడిపినా.. కొన్ని సార్లు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ప్రస్తుతం అలాంటి ఘటనే జరిగింది. గుజరాత్‌లోని వడోదరలో అలాంటి వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. జనవరి 18 రాత్రి వడోదరలోని అల్కాపురి ప్రాంతంలో ఓ మహిళ కారు పార్కింగ్ చేస్తుంది. ఈ క్రమంలో బ్రేక్‌కు బదులు యాక్సిలేరేటర్‌ను నొక్కింది. అంతే వెంటనే అక్కడున్న మెట్లపైనుంచి ఓ షోరూమ్‌లోకి దూసుకుపోయింది. ఈ తతంగమంతా స్టోర్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. షోరూమ్ యజమాని మహేశ్‌భాయ్ సింధాని పోలీస్ స్టేషన్‌లో మహిళపై ఫిర్యాదు చేశారు. టపాసులు కొనుగోలు చేసేందుకు ఆ మహిళ దుకాణానికి వచ్చింది. కారు ఢీకొనడంతో షోరూమ్‌లోని ఒకవైపు అద్దాలు మొత్తం పగిలిపోయాయి. భారీ శబ్దం రావడంతో సమీప ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ వీడియో కాస్తా నెట్టింట చేరడంతో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు ఓ రేంజ్‌లో సెటైర్లు వేస్తున్నారు. ఫన్నీ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఏటీఎం చోరీకి వచ్చి దొంగ.. సీసీటీవీని చూస్తూ దేవుడ్ని ప్రార్థించి.. మొదలెట్టాడు..
ముల్లంగి ఆకులను పడేస్తున్నారా ఆరోగ్య ప్రయోజనాలను మిస్ అవుతున్నట్లే !!
అమ్మ బాబోయ్.. మళ్లీ ఎంటరయ్యారు.. చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్ !!
బోనులో సింహం.. బయట నిలబడి యువకుడి చిందులు.. దెబ్బకి అది కొరికి పడేసింది !!
ప్రేమికుల విగ్రహాలకు పెళ్లి జరిపించిన పెద్దలు !! అసలు ఏం జరిగిందంటే ??
కస్టమర్లను గోకడమే పని.. నెలకు రూ.14 లక్షల ఆదాయం!
200 ఏళ్ల తర్వాత ఆ వంశంలో ఆడపిల్ల జననం..
బాస్.. నీ ఐడియాకి హ్యాట్సాఫ్..
స్పైడర్ మ్యాన్‌లా స్టంట్ చేయాలనుకున్నాడు.. చివరికి ఇలా..
పగలు ఆర్ఎంపీ డాక్టర్.. రాత్రయితే..
వైకల్యాన్ని జయించి మద్రాస్ ఐఐటీలో సీటు సాధించి..
దోమతెర కప్పుకుందామని తీసిన యువకుడు.. కాలికి తాకిన దానిని చూసి

