దడదడలాడించిన భారీ కింగ్ కోబ్రా.. స్నేక్ క్యాచర్ ధైర్యానికి ఫిదా అవ్వాల్సిందే !!
ఇటీవల వన్యమృగాలు అడవి బాటను వీడి జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. పులులు, ఏనుగులు, కొండచిలువలు, పాములు.. ఇలా అన్ని రకాల వన్య ప్రాణులు ప్రజల మధ్యలోకి వచ్చి భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.
ఇటీవల వన్యమృగాలు అడవి బాటను వీడి జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. పులులు, ఏనుగులు, కొండచిలువలు, పాములు.. ఇలా అన్ని రకాల వన్య ప్రాణులు ప్రజల మధ్యలోకి వచ్చి భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. దీనికి తోడు ప్రస్తుతం సమ్మర్ సీజన్ నడుస్తుంది. వేసవి తాపంతో దాహం వేసి కొండచిలువలు, పాములు జనవాసాల్లోకి వచ్చేస్తున్నాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో 13 అడుగుల కింగ్ కోబ్రా తీవ్ర కలకలం రేపింది. కంచిలి మండలం కుమ్మరినౌగాంలో నివాసాల వద్ద కింగ్ కోబ్రా తచ్చాడుతూ ఉండగా స్థానికులు గుర్తించారు. భయాందోళనకు గురైన వారు వెంటనే సోంపేటకు చెందిన పాములు పట్టే బాలరాజుకు సమాచారమందించారు. అతను చాకచక్యంగా కింగ్ కోబ్రాను పట్టుకున్నాడు. అనంతరం ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులకు తెలిపారు. వారి సూచనల మేరకు కింగ్‌కోబ్రాను అటవీ ప్రాంతంలో వదిలివేసినట్లు గ్రామస్తులు తెలిపారు. కాగా కంచిలి మండల పరిధిలో జలంత్రకోట, బొగాబెణి తదితర ప్రాంతాల్లో ఇటీవల తరచూ కింగ్ కోబ్రాలు కనిపిస్తున్నాయని, అందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆదర్శగురువు.. కొబ్బరినూనె తెచ్చి స్టూడెంట్స్ తలలకు రుద్దిన టీచర్ !! ఎందుకో తెలుసా ??
Allu Arha: మాటల యుద్దం.. అందర్నీ ఫిదా చేస్తున్న అర్హ..
Pushpa 2: ఏకంగా 100 మిలియన్లు వైపు.. దిమ్మతిరిగేలా చేస్తున్న పుష్ప
తెలుగు హీరో చేసుంటే.. శాకుంతలం ఇంకో రేంజ్‌లో ఉండేదిగా !!
Balagam: బలగం” కు జేజేలు కొడుతున్న ప్రపంచం