అమానుషం.. యాచకుడి డబ్బు దోచేసిన దుండగులు !! చివరికి ??
కర్నూలు లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. భిక్షాటన చేసుకుని జీవిస్తున్న వ్యక్తి డబ్బును అపహరించారు ఇద్దరు వ్యక్తులు. అనారోగ్యంతా బాధపడుతున్న ఆ యాచకుడు తన డబ్బు పోవడంతో లబోదిబోమన్నాడు.
కర్నూలు లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. భిక్షాటన చేసుకుని జీవిస్తున్న వ్యక్తి డబ్బును అపహరించారు ఇద్దరు వ్యక్తులు. అనారోగ్యంతా బాధపడుతున్న ఆ యాచకుడు తన డబ్బు పోవడంతో లబోదిబోమన్నాడు. విషయం కొందరు గ్రామస్తులతో చెప్పగా వారు పోలీసులకు సమాచారమిచ్చారు. స్థానిక దర్గాలో ఉండే ఇద్దరు వ్యక్తులు తన డబ్బును అపహరించారని తెలిపాడు. 40 ఏళ్లుగా భిక్షాటన చేసి సంపాదించుకున్న దాదాపు 4 లక్షల రూపాయలను ఇద్దరు వ్యక్తులు ఎత్తుకెళ్లారని తెలిపాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వారినుంచి 3 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న యాచకుడిని బళ్లారి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. స్వాధీనం చేసుకున్న డబ్బును తహశీల్దారుకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దడదడలాడించిన భారీ కింగ్ కోబ్రా.. స్నేక్ క్యాచర్ ధైర్యానికి ఫిదా అవ్వాల్సిందే !!
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

