వామ్మో.. వంద కేజీల చేప వీడియో
ఒరిస్సాలోని సుబర్ణపూర్ జిల్లా బినికా పట్టణంలోని మహానదిలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు ఓ అరుదైన చేప చిక్కింది. వల వేసిన కాసేపటికి బరువుగా అనిపించడంతో పైకి లాగగా.. ఆరు అడుగుల పొడవు, క్వింటా బరువున్న బోద చేప కనిపించింది. దీంతో ఆ జాలర్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఒడ్డుకు తీసుకొచ్చాక ఆ చేపను చూసేందుకు స్థానికులు భారీగా తరలివచ్చారు
ఈ చేప శాస్త్రీయనామం ‘గుంచ్ కాట్‌ఫిష్’ (Goonch Catfish). స్థానికులు దీనిని బోద చేప అంటారు. భారీ బరువుండే ఈ చేపలలో ఔషధ విలువలుంటాయని జాలర్లు తెలిపారు. కేజీ రూ. 300 పలుకుతాయని, ఈ లెక్కన ఈ భారీ చేపకు రూ. 30 వేలు రావొచ్చిన వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చేపలు తింటే తక్షణ శక్తి లభించటమే గాక ఒంట్లోని చెడు కొవ్వు కరుగుతుందని, కీళ్ల నొప్పులూ తగ్గుతాయని స్థానికులు తెలిపారు. ‘నేను చాలా ఏళ్లుగా చేపల వేటకు వెళుతున్నా.. ఇంత పెద్ద చేప దొరకటం మాత్రం ఇదే తొలిసారి’ అని సదరు జాలరి అనంతరాం ముదులీ ఆనందం వ్యక్తం చేశారు. గతంలో 30 – 40 కేజీల బోద చేపలు పడేవని, ఈసారి మాత్రం గంగమ్మ తల్లి దయతో.. తన పంటపండిందని అతడు సంతోషపడిపోయాడు. కాగా ఈ భారీ చేపను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాలనుంచి చిన్నారులతో సహా జనాలు తండోపతండాలుగా తరలివచ్చారు.
మరిన్ని వీడియోల కోసం :
లైవ్ కవరేజ్ చేస్తూ.. వరదలో కొట్టుకుపోయిన జర్నలిస్ట్ వీడియో
కోళ్ల షెడ్డుకు వేసిన ఫెన్సింగ్ నుంచి వింత శబ్దాలు.. దగ్గరకు వెళ్లి చూస్తే వీడియో
ఇదెక్కడి చోద్యం.. ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకున్న బ్రదర్స్ వీడియో
నదిలో ఉండాల్సిన మొసలి.. రోడ్డుపైకి రావడంతో.. వీడియో
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
