AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ట్రాక్టర్‌ను ఢీకొన్న టాటా టియాగో.. రెండు ముక్కలైన ట్రాక్టర్‌.. సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌

దేశంలో ఫోర్‌ స్టార్‌ రేటింగ్‌ ఉన్న కార్లు ఎన్నో ఉన్నాయి. అలాంటి కార్లు అన్ని పరీక్షలు చేసిన తర్వాత స్టార్‌ రేటింగ్స్‌ను ఇస్తుంటాయి. అయితే 4-స్టార్ రేటింగ్ ఉన్న ఏకైక కారు టాటా టియాగో. ఈ కారు..

Viral Video: ట్రాక్టర్‌ను ఢీకొన్న టాటా టియాగో.. రెండు ముక్కలైన ట్రాక్టర్‌.. సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌
Ttata Tiago Tractor
Subhash Goud
|

Updated on: Jan 11, 2023 | 5:44 PM

Share

దేశంలో ఫోర్‌ స్టార్‌ రేటింగ్‌ ఉన్న కార్లు ఎన్నో ఉన్నాయి. అలాంటి కార్లు అన్ని పరీక్షలు చేసిన తర్వాత స్టార్‌ రేటింగ్స్‌ను ఇస్తుంటాయి. అయితే 4-స్టార్ రేటింగ్ ఉన్న ఏకైక కారు టాటా టియాగో. ఈ కారు గతంలో అనేక ప్రమాదాలకు గురైంది. టియాగో చాలా మంది ప్రయాణికుల ప్రాణాలను ఎలా కాపాడిందో కూడా విని ఉంటారు. టాటా టియాగో ట్రాక్టర్‌ను ఎదురెదురుగా ఢీకొని ప్రమాదం కూడా చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌ రెండు ముక్కలైపోయింది. ఈ ఘటన కర్ణాటకలోని మైసూర్‌లో చోటుచేసుకుంది. నలుగురితో కూడిన కుటుంబం హైవేపై ప్రయాణిస్తుండగా హాసన్ జిల్లా హోసహళ్లి రోడ్డు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. కడులోని హోసహళ్లిలో ఉన్న ఆలయం నుంచి కుటుంబం తిరిగి వస్తోంది. ప్రమాదానికి సంబంధించిన ఖచ్చితమైన వివరాలు బయటకు రానప్పటికీ, టియాగో ట్రాక్టర్‌ను ఎలా ఢీకొట్టిందో తెలియదు కాని ఇది ఓవర్‌టేక్ సంఘటనగా కనిపిస్తోంది.

అయితే ఈ ప్రమాదంలో టాటా టియాగోకు స్వల్ప నష్టం వాటిల్లగా, ట్రాక్టర్ మాత్రం రెండుగా విరిగిపోయింది. టాటా టియాగోలో ఉన్న ప్రయాణికులు, ట్రాక్టర్ డ్రైవర్ సురక్షితంగా బయట పడ్డారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ప్రమాదం తర్వాత ట్రాక్టర్ రెండుగా చీలిపోవడం ఇదే మొదటిసారి కాదు. కొన్ని వారాల క్రితం Mercedes-Benz GLC రాంగ్ రూట్‌లో వస్తున్న ట్రాక్టర్‌ని ఢీకొట్టింది. ఆ ట్రాక్టర్‌ను కూడా రెండు భాగాలుగా విరిగిపోయింది. వాహనాలు నడిపే ముందు వాహనం ముందుకు ఎలా పోతుంది..? రహదారికి సరైన మార్గంలో వెళ్తుందా? లేదా వన్‌సైడ్‌ వెళ్తోందా అని చూడాలి. చిన్న పొరపాటు ఇలాంటి ప్రమాదాలకు దారి తీస్తుంది. ఇలాంటి అనేక ప్రమాదాలు ప్రాణాంతకంగా కూడా మారుతున్నాయి.

చాలా చోట్ల నెమ్మదిగా వెళ్లే రహదారులపై వాహనాలను ఓవర్‌టేక్ చేసేందుకు అనుమతి ఉండదు. ఎందుకంటే చిన్నపాటి రోడ్లు ఉండటం కారణంగా డ్రైవర్‌, ప్రయాణికుల భద్రత కోసం ఓవర్‌ టెక్‌ చేసేందుకు ఉండదు. భారతదేశంలో భారీ వాహనాలకు వాణిజ్య లైసెన్స్ పొందడం చాలా కష్టం. విచ్చలవిడిగా తిరిగే జంతువులు, పశువులు, పాదచారులు రోడ్డు దాటడం మనం తరచూ చూస్తుంటాం. ఇండికేటర్లు ఉపయోగించకుండా తప్పుడు మార్గంలో వచ్చే వాహనాలు కూడా ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో వేగాన్ని నియంత్రించడానికి భారతీయ రహదారులపై సురక్షితమైన వేగ పరిమితిలో నడపడం చాలా ముఖ్యం.

View this post on Instagram

A post shared by Hassan News (@hassan_news)

భారతదేశంలో సరైన మార్గం అనే భావన లేనందున, మీరు క్రాసింగ్‌కు చేరుకున్నప్పుడు రోడ్లపై వేగాన్ని తగ్గించడం చాలా మంచిది. అలాగే హైవేలపై, నగరాలు, గ్రామాలు వంటి జనావాస ప్రాంతాలను దాటుతున్నప్పుడు వేగాన్ని తగ్గించడం ఎంతో ముఖ్యం. పాదచారులకు సరైన క్రాసింగ్‌లు ఏర్పాటు చేసినప్పటికీ, చాలా మంది ఈ క్రాసింగ్‌లను ఉపయోగించకుండా హైవేలపై తిరుగుతూ సమయాన్ని ఆదా చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగే ఇలాంటి ప్రాంతాల్లో విచ్చలవిడి జంతువులు, పశువులు సంచరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే వాహనాలు నడిపే ముందు క్రాసింగ్‌లు, జన సంచరం, జంతువులను గమనించడం చాలా ముఖ్యం. దీని వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగకుండా చూసుకోవచ్చు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి