AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Deverakonda: వామ్మో! మరీ ఇలా ప్లాన్ చేసాక.. రౌడీ ఇంక దొరుకుతాడా..

Vijay Deverakonda: వామ్మో! మరీ ఇలా ప్లాన్ చేసాక.. రౌడీ ఇంక దొరుకుతాడా..

Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: |

Updated on: Jan 23, 2026 | 5:33 PM

Share

విజయ్ దేవరకొండ రెండు భారీ చిత్రాలతో గ్రాండ్ కమ్‌బ్యాక్‌కు సిద్ధమవుతున్నారు. 'రౌడీ జనార్ధన' 2026లో విడుదల కానుండగా, రాహుల్ సంక్రీత్యన్ దర్శకత్వంలో 1854-78 కాలం నాటి భారీ వారియర్ స్టోరీ జనవరిలో టీజర్‌తో రానుంది. గత పరాజయాల తర్వాత బాక్సాఫీస్‌ను షేక్ చేసేలా, విమర్శకులను ఆశ్చర్యపరిచేలా ఈ ప్రాజెక్ట్‌లతో విజయ్ తన సత్తా చాటాలని చూస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ రూ. 100 కోట్లతో రాహుల్ సినిమాను నిర్మిస్తున్నారు.

కమ్‌బ్యాక్ ఇస్తే బాక్సాఫీస్ షేక్ అయిపోవాలి.. విమర్శించిన వాళ్లే వారెవ్వా అనాలి.. కాస్త లేటైనా అదే జరుగుతుందంటున్నారు విజయ్ దేవరకొండ. రౌడీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ చూస్తుంటే ఇదే జరిగేలా కనిపిస్తుంది. ఒకేసారి రెండు మాసివ్ సినిమాలతో దండయాత్రకు సిద్ధమవుతున్నారీయన. మరి విజయ్ నమ్మకానికి అసలు కారణమేంటి.. కమ్‌బ్యాక్ కోసం ఏం జరుగుతుంది..? హిట్టు ఫ్లాపులతో పనిలేకుండా విజయ్ దేవరకొండకు ఓ మార్కెట్ ఉంది.. ఆయనకు తగ్గ సినిమా పడ్డ రోజు బాక్సాఫీస్ షేక్ అవుతుందనడంలో అనుమానం అవసరం లేదు. లైగర్, కింగ్డమ్ ఫ్లాపైనా.. ఓపెనింగ్స్ అదిరిపోయాయి. తాజాగా రౌడీ జనార్ధనతో పాటు రాహుల్ సంక్రీత్యన్‌ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు రౌడీ బాయ్. రవికిరణ్ కోలా తెరకెక్కిస్తున్న రౌడీ జనార్ధన 2026 డిసెంబర్‌లో రానుంది.. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. తాజాగా రాహుల్ సినిమాను కూడా పట్టాలెక్కించారు విజయ్. దీనిపై ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. 1854 నుంచి 1878 మధ్యలో ఉండే వారియర్ స్టోరీ ఇది.. ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ అయింది.. జనవరిలోనే టీజర్ విడుదల కానుంది. టాక్సీవాలా తర్వాత విజయ్, రాహుల్ కలిసి చేస్తున్న రెండో సినిమా ఇది. అప్పుడు సూపర్ న్యాచురల్ థ్రిల్లర్‌తో హిట్ కొట్టిన ఈ జోడీ.. ఈసారి పీరియడ్ సినిమాతో వస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ 100 కోట్లకు పైగా బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మొత్తానికి ఇటు రౌడీ జనార్ధన.. అటు రాహుల్ సినిమాలతో మాసివ్ కమ్ బ్యాక్ కోసం చూస్తున్నారు విజయ్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Varanasi: వారణాసి విషయంలో రాజమౌళి సంచలన నిర్ణయం

Venkatesh: ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌పై వెంకటేష్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్

Top 9 ET: అన్న విజయానికి తమ్ముడి క్రేజీ రియాక్షన్ | బాస్‌ దెబ్బకు..కళ్ల ముందుకు గత వైభవం

టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్

పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..