యాంకర్ లైవ్ వార్తలు చదువుతుండగా..ఊహించని ఘటన వీడియో
ఇరాన్‌పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. సైనిక స్థావరాలు, చమురు క్షేత్రాలు, అణుశుద్ధి కేంద్రాలే లక్ష్యంగా చేసుకొని భీకర దాడులకు దిగుతోంది. ఈ క్రమంలోనే ఇరాన్ అధికారిక టీవీ యాంకర్‌కు ఊహించని అనుభవం ఎదురైంది. ఆమె వార్తలు చదువుతుండగానే.. స్టూడియోపై దాడి జరిగింది. దీంతో ఆమె ప్రాణ భయంతో వెంటనే స్టూడియో నుంచి పరుగులు తీసింది.
ఇరాన్‌పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. సైనిక స్థావరాలు, చమురు క్షేత్రాలు, అణుశుద్ధి కేంద్రాలే లక్ష్యంగా చేసుకొని భీకర దాడులకు దిగుతోంది. ఈ క్రమంలోనే ఇరాన్ అధికారిక టీవీ యాంకర్‌కు ఊహించని అనుభవం ఎదురైంది. ఆమె వార్తలు చదువుతుండగానే.. స్టూడియోపై దాడి జరిగింది. దీంతో ఆమె ప్రాణ భయంతో వెంటనే స్టూడియో నుంచి పరుగులు తీసింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ ఘటనతో సదరు టీవీ తన ప్రత్యక్ష ప్రసారాన్ని నిలిపివేసింది. టెహ్రాన్‌లో టీవీ స్టూడియోలు ఉన్న ప్రాంతాన్ని ఖాళీ చేయాలని అంతకు గంటముందే ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. ఇదిలా ఉండగా.. ఇరాన్‌పై వైమానిక ఆధిపత్యం సాధించామని టెల్ అవీవ్ సోమవారం ప్రకటించింది. పశ్చిమ ఇరాన్ నుంచి రాజధాని టెహ్రాన్ వరకు గగనతలం తమ నియంత్రణలో ఉన్నట్లు వెల్లడించింది.
మరిన్ని వీడియోల కోసం :