Viral: భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!

Viral: భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!

Anil kumar poka

|

Updated on: Jan 01, 2025 | 4:33 PM

కొన్నేళ్లుగా వరుస దొంగతనాలు చేస్తూ చాకచక్యంగా తప్పించుకు తిరుగుతున్న భలే బ్రదర్స్ ఆట కట్టించారు మధ్యప్రదేశ్‌లోని మౌగంజ్ సిటీ పోలీసులు. సౌరభ్ వర్మ, సంజీవ్ వర్మ దొంగతనాలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఒకరు దొంగతనాలు చేస్తే, మరొకడు వేరేచోట చక్కర్లు కొడుతూ ఆ సీసీ టీవీ పుటేజీ చూపించి తప్పించుకుంటారు.

వీరిద్దరూ కవలలు అనే విషయం ఆ గ్రామస్తులకు తప్ప బయటి వ్యక్తులకు పెద్దగా తెలియదు. అందుకే వీరు ఎవరూ గుర్తు పట్టకూడదనే ఉద్దేశంతో కలిసి ఎక్కడికీ వెళ్లరు. ఒకేలాంటి దుస్తులు ధరించడం, ఒకేలాంటి ఆహార్యంతో ఇంతకాలం మేనేజ్ చేస్తూ వచ్చారు. సౌరభ్ వర్మ దొంగతనాలు చేయడంలో ఆరితేరగా, సంజీవ్ వర్మ పోలీసులను తప్పుదోవ పట్టించడంలో ఆరితేరాడు. అయితే, ఈ నెల 23న మౌగంజ్ సిటీలో ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు ఆ ఇంట్లోకి ప్రవేశించి నగలు, నగదు దోచుకెళ్లారు. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వీరిలో సౌరభ్ వర్మ కూడా ఉన్నాడు. ఈ నేపథ్యంలో సోదరుడి కోసం సంజీవ్ వర్మ పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు. సంజీవ్ వర్మను చూసిన పోలీసులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. లోపల ఉన్న నిందితుడు బయటకు ఎలా వచ్చాడో తెలియక ఆశ్చర్యపోయారు. దీంతో పోలీసులు తమదైన స్టైల్‌లో విచారణ చేయగా, తాము కవల సోదరులమని అసలు విషయం బయటపెట్టారు. వారి వద్ద నుంచి లక్షలాది రూపాయల దోపిడీ సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Published on: Jan 01, 2025 04:33 PM