బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 6న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది ఏసీబీ. హైదరాబాద్లో ఫార్ములా–ఈ కార్ రేస్ నిర్వహణకు సంబంధించి హెచ్ఎండీఏ నుంచి విదేశీ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా నిధులు మళ్లించారన్నది ఈ కేసులో ప్రధాన ఆరోపణ.