సినీ నటుడు అల్లు అర్జున్‌కు పెను ఊరట దక్కింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో సినీ నటుడు అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. రూ. 50 వేలతో పాటు, రెండు పూచీకత్తులపై బెయిల్ మంజూరు చేసింది కోర్టు. ప్రస్తుతం హైకోర్టు మధ్యంతర బెయిల్‌పై ఉన్నారు అర్జున్.