బెంగళూరు డ్రగ్స్ కేసులో నటి హేమకు ఊరట లభించింది. హేమపై నమోదైన కేసుపై బెంగళూరు హైకోర్టు స్టే ఇచ్చింది. గతేడాది బెంగళూరులో హేమపై రేవ్ పార్టీ కేసు నమోదైంది. తనపై నమోదైన డ్రగ్స్ కేసును కొట్టివేయాలని పిటిషన్ వేశారు. ఇప్పటికే బెంగళూరు పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు.