వరి పొలం బురదలో దిగి.. నాట్లు వేసిన డిప్యూటీ కలెక్టర్ హరిణి
జగిత్యాల ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ హరిణి ధర్మపురి మండలంలో చేసిన క్షేత్ర పర్యటన విశేష స్పందన పొందింది. ఆమె పొలాల్లోకి వెళ్లి మహిళా రైతులతో కలిసి వరినాట్లు వేస్తూ, వారి గ్రామీణ జీవన కష్టసుఖాలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. కూలీలతో కలిసి భోజనం చేసి, పండ్లు పంచి, సెల్ఫీలు తీసుకున్నారు. ఈ మానవీయ చర్య స్థానికులను ఎంతగానో ఆకట్టుకుంది, ప్రజలతో మమేకమైన అధికారిణిగా ప్రశంసలు అందుకున్నారు.
జగిత్యాల జిల్లాలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ హరిణి చేసిన క్షేత్ర స్థాయి పర్యటనకు విశేష స్పందన లభించింది. ధర్మపురి మండలంలోని గ్రామాల్లో ఆమె పొలాల్లోకి వెళ్లి వ్యవసాయ కూలీలతో కలిసి వరి నాట్లు వేస్తూ, గ్రామీణ జీవన కష్టసుఖాలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. అధికారిణిగా మాత్రమే కాకుండా ప్రజలతో కలిసిపోయిన ఆమె పర్యటన అందరి ప్రశంసలు పొందింది. జగిత్యాల జిల్లాకు ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ గా నియమితులయ్యారు హరిణి. గ్రామీణ ప్రాంతాల్లో క్షేత్ర స్థాయి పర్యటనకు వెళ్లారు. ధర్మపురి మండలంలోని తిమ్మాపూర్, బూరుగుపల్లి గ్రామాల్లో పర్యటించారు. పొలాల్లోకి నేరుగా వెళ్లిన హరిణి, వ్యవసాయ కూలీలతో మమేకమయ్యారు. వరి పొలంలోకి దిగిన ఆమె.. రైతులు మహిళా కూలీలతో కలిసి వరి నాట్లు వేసి, వారి జీవన విధానం, కష్టసుఖాలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. నాట్లు వేసే విధానాన్ని అడిగి తెలుసుకున్న ట్రైనీ డిప్యూటీ కలెక్టర్, స్వయంగా బురదలోకి దిగి కొంతసేపు నాట్లు వేశారు. వ్యవసాయ పనులు చేస్తున్న కూలీలతో కలిసి పనిచేసిన అనంతరం, లంచ్ సమయంలో వారికి పండ్లను పంపిణీ చేశారు. అలాగే మహిళా రైతులతో కలిసి సెల్ఫీలు దిగుతూ, సుమారు అరగంట పాటు వారి మధ్య గడిపారు. గ్రామీణ మహిళలతో కలిసి పనిచేయడం, వారి జీవన పరిస్థితులను తెలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని హరిణి తెలిపారు. అధికారిణిగా మాత్రమే కాకుండా, గ్రామీణ ప్రజలతో కలిసిపోయిన ఆమె క్షేత్ర స్థాయి పర్యటన స్థానికుల్లో విశేష స్పందనను పొందింది. నేరుగా అధికారి పొలాల్లోకి వచ్చి తమతో కలిసి పనిచేయడం చూసి మహిళా రైతులు సంతోషం వ్యక్తం చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Yadadri: యాదాద్రిలో గుప్త నిధుల కలకలం
456 సంచుల్లో దొరికిన మృతదేహాలు.. అసలు కథ ఏంటంటే ??
రిపబ్లిక్ డే పరేడ్.. పక్షుల కోసం ఇలా
ఇంటి నుంచే సైబర్ క్రైమ్ ఎఫ్‌ఐఆర్.. బాధితులకు అండగా ‘సీ-మిత్ర’ హెల్ప్ డెస్క్
456 సంచుల్లో దొరికిన మృతదేహాలు.. అసలు కథ ఏంటంటే ??
లీటరు వంట నూనె 18 లక్షలు.. ఒక్క ట్రే గుడ్ల ధర 35 లక్షలు
రోడ్డుపై రైల్వే గేట్ను ఢీకొట్టిన వ్యాన్.. ఇంతలోనే..
రష్యా వీధుల్లో భారత టెకీ.. జీతం నెలకు రూ. 1.1 లక్షలు
‘బిర్యానీ క్యాపిటల్’గా టాప్లో హైదరాబాద్
బైకర్ చెంపపై కొట్టిన ట్రాఫిక్ పోలీస్.. నెటిజన్లు సీరియస్
సంక్రాంతి ముందు నాన్వెజ్ ప్రియులకు షాక్..

