ఉదయాన్నే పొలానికి వెళ్తున్న రైతులు.. దారిలో సీన్ చూసి పరుగులు
రైతులు, కూలీలు వ్యవసాయ పనుల కోసం ఉదయాన్నే పొలానికి వెళ్తున్నారు. వారు వెళ్లే దారిలో ఓ భయానక దృశ్యం కనిపించింది. దాంతో అది దాటి వెళ్లడానికి సాహసించలేదు వారు. వెంటనే భయంతో వెనక్కి పరుగులు తీశారు. రోడ్డుపై క్షుద్రపూజల ఆనవాళ్లు వారిని తీవ్ర భయాందోళనకు గురి చేశాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని నీరుకుల్లకు వెళ్లే రోడ్డుపై క్షుద్ర పూజలు చేశారు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు.
రైతులు, కూలీలు వ్యవసాయ పనుల కోసం ఉదయాన్నే పొలానికి వెళ్తున్నారు. వారు వెళ్లే దారిలో ఓ భయానక దృశ్యం కనిపించింది. దాంతో అది దాటి వెళ్లడానికి సాహసించలేదు వారు. వెంటనే భయంతో వెనక్కి పరుగులు తీశారు. రోడ్డుపై క్షుద్రపూజల ఆనవాళ్లు వారిని తీవ్ర భయాందోళనకు గురి చేశాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని నీరుకుల్లకు వెళ్లే రోడ్డుపై క్షుద్ర పూజలు చేశారు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు. జిల్లేడు, మోతుకు, బొమ్మిడి.. ఇలా మూడు రకాల ఆకులతో విస్తరాకు తయారుచేసి, అందులో అన్నంతో చేసిన ముద్దలపై పసుపు, కుంకుమ వేసి, నిమ్మకాయలు, కోడిగుడ్డు పెట్టి పూజలు చేశారు. ఆ దారివెంట పొలాలకు వెళ్లేవారు, ఇతర ప్రయాణికులు ఎవరైనా క్షుద్రపూజలు చేశారేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ రహదారిపై ఆది, గురువారాల్లో ఇలాంటివి తరచూ కనిపిస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. ఎవరైనా అనారోగ్యం బారిన పడితే వారికి పీడ వదిలి ఆరోగ్యంగా ఉండాలని కూడా ఇలాంటివి చేస్తుంటారని అంటున్నారు. మరోవైపు ఎవరైనా కావాలని చేతబడులు చేస్తున్నారా అన్న అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వరి పొలం బురదలో దిగి.. నాట్లు వేసిన డిప్యూటీ కలెక్టర్ హరిణి
Yadadri: యాదాద్రిలో గుప్త నిధుల కలకలం
456 సంచుల్లో దొరికిన మృతదేహాలు.. అసలు కథ ఏంటంటే ??
రిపబ్లిక్ డే పరేడ్.. పక్షుల కోసం ఇలా
ఇంటి నుంచే సైబర్ క్రైమ్ ఎఫ్‌ఐఆర్.. బాధితులకు అండగా ‘సీ-మిత్ర’ హెల్ప్ డెస్క్
ఉదయాన్నే పొలానికి వెళ్తున్న రైతులు.. దారిలో సీన్ చూసి పరుగులు
456 సంచుల్లో దొరికిన మృతదేహాలు.. అసలు కథ ఏంటంటే ??
లీటరు వంట నూనె 18 లక్షలు.. ఒక్క ట్రే గుడ్ల ధర 35 లక్షలు
రోడ్డుపై రైల్వే గేట్‌ను ఢీకొట్టిన వ్యాన్.. ఇంతలోనే..
రష్యా వీధుల్లో భారత టెకీ.. జీతం నెలకు రూ. 1.1 లక్షలు
‘బిర్యానీ క్యాపిటల్’గా టాప్‌లో హైదరాబాద్
బైకర్ చెంపపై కొట్టిన ట్రాఫిక్ పోలీస్.. నెటిజన్లు సీరియస్

