ఇంటి నుంచే సైబర్ క్రైమ్ ఎఫ్‌ఐఆర్.. బాధితులకు అండగా ‘సీ-మిత్ర’ హెల్ప్ డెస్క్
సైబర్ నేరాలు పెరిగిపోతున్న తరుణంలో, హైదరాబాద్ పోలీసులు 'సీ-మిత్ర'ను ప్రారంభించారు. సైబర్ మోసాలకు గురైనవారు ఇంటి నుంచే FIR నమోదు చేయడానికి ఇది వీలు కల్పిస్తుంది. 1930 టోల్‌ఫ్రీ నంబర్ లేదా cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. రూ.3 లక్షల లోపు కేసులను సీ-మిత్ర ద్వారా జీరో FIR చేసి, AI సాయంతో వాట్సాప్ ద్వారా FIR డ్రాఫ్ట్‌ను పంపుతారు. నకిలీ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి.
రోజురోజోకు సైబర్ క్రైమ్స్ పెరుగుతున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రెటీస్ వరకు సైబర్ కేటుగాళ్ల ఉచ్చులో చిక్కుకుంటున్నారు. అంతేకాదు..సైబర్ క్రైమ్స్ గురించి ఎంతో అవగాహన వున్న పోలీసులు సైతం ఆ కేటుగాళ్ల ట్రాప్‌లో పడుతున్నారు. అయితే సైబర్ చీటింగ్‌పై ఏం చేయలి? ఎవరికి ఫిర్యాదు చేయాలి అనే అంశంలో కొంత అవగాహన లోపం ఉంది. ఈ క్రమంలో నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో సైబర్ మోసాలకు గురయ్యేవారు ఇకపై పోలీస్‌స్టేషన్‌లకు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన పనిలేదంటున్నారు పోలీసులు. ఇంటి నుంచే ఎఫ్‌ఐఆర్ పొందేందుకు అనువుగా ‘సీ-మిత్ర’ను అందుబాటులోకి తెచ్చారు. ప్రతి రోజు ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉండేలా 24 మందితో కూడిన హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశారు. సైబర్ నేరాల బాధితులు ఇంటి నుంచే ఎఫ్‌ఐఆర్ పొందేందుకు వీలుగా సీసీఎస్ కార్యాలయంలో ‘సీ-మిత్ర’ హెల్ప్‌డెస్క్‌ను ప్రారంభించినట్లు సీపీ సజ్జనార్ వెల్లడించారు. రూ.3 లక్షల లోపున్న కేసులను సీ-మిత్రలో జీరో ఎఫ్‌ఐఆర్ చేసి.. సంబంధిత ఠాణాలకు బదిలీ చేస్తారు. రూ.3 లక్షలకు పైన ఉన్న ఫిర్యాదులను సైబర్ క్రైమ్ ఠాణాలో చేయవచ్చు. బాధితులు టోల్‌ఫ్రీ నంబరు 1930, cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలి. ఫిర్యాదు అందగానే సీ-మిత్ర బృందం ఫిర్యాదు చేసే విధానాన్ని వివరించి.. ఏఐ సాయంతో ఫిర్యాదు డ్రాఫ్ట్‌ను సిద్ధం చేసి బాధితుల వాట్సప్ నంబరుకు పంపుతారు. బాధితులు దాన్ని ప్రింట్ తీసి, సంతకం చేసి ‘సైబర్ మిత్ర హెల్ప్‌డెస్క్, స్టేషన్ హౌస్ ఆఫీసర్, క్రైమ్ పోలీస్‌స్టేషన్, కమిషనర్ ఆఫీస్, బషీర్‌బాగ్ హైదరాబాద్’ చిరునామాకు పంపవచ్చు. స్టేషన్ బయట డ్రాప్ బాక్స్‌లోనూ వేయవచ్చు. అయితే హెల్ప్‌డెస్క్ అధికారిక ఫోన్ నంబరు 040-41893111తో మాత్రమే సీ-మిత్ర నుంచి కాల్స్ వస్తాయి. వాట్సప్ ద్వారా పంపేందుకు 87126 సిరీస్ నంబర్లు మాత్రమే ఉపయోగిస్తారు. సీ-మిత్ర పేరుతో వచ్చే నకిలీ కాల్స్‌పై అప్రమత్తంగా ఉండాలని సీపీ సజ్జనార్ సూచించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
లీటరు వంట నూనె 18 లక్షలు.. ఒక్క ట్రే గుడ్ల ధర 35 లక్షలు
రోడ్డుపై రైల్వే గేట్‌ను ఢీకొట్టిన వ్యాన్.. ఇంతలోనే దూసుకొచ్చిన ట్రైన్
ఇక్కడ ఆడాల్సిందే.. లేదంటే ఇంటికే బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్
MSVG Review: చిరును వాడడం అంటే ఇది! అనిల్ మళ్లీ నెగ్గాడ్రోయ్..! రివ్యూ…!
Toxic: కారులో ఆ పాడు సీన్ పై రచ్చ.. డిలీట్ చేయాలంటూ డిమాండ్
లీటరు వంట నూనె 18 లక్షలు.. ఒక్క ట్రే గుడ్ల ధర 35 లక్షలు
రోడ్డుపై రైల్వే గేట్‌ను ఢీకొట్టిన వ్యాన్.. ఇంతలోనే..
రష్యా వీధుల్లో భారత టెకీ.. జీతం నెలకు రూ. 1.1 లక్షలు
‘బిర్యానీ క్యాపిటల్’గా టాప్‌లో హైదరాబాద్
బైకర్ చెంపపై కొట్టిన ట్రాఫిక్ పోలీస్.. నెటిజన్లు సీరియస్
సంక్రాంతి ముందు నాన్‌వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు

