కిలో టమాటా.. 50 పైసలే !! ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్
మొన్నటి వరకూ కిలో 200 పలికిన టమాటా ధర భారీగా పతనం అయింది. ట్రాన్స్ పోర్టు చార్జీలు కూడా రాని పరిస్థితి ఏర్పడడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్‌లో కొన్ని రోజులుగా కిలో టమాటా 3 రూపాయిల పలికింది. ఇప్పుడు మరింత పతనమై కిలో టమాటా 50పైసలకు చేరింది. మంచి దిగుబడి వచ్చే సమయంలో ధర పడిపోవడంతో టమాటా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడి కూడా రావడం లేదని రైతుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు
మొన్నటి వరకూ కిలో 200 పలికిన టమాటా ధర భారీగా పతనం అయింది. ట్రాన్స్ పోర్టు చార్జీలు కూడా రాని పరిస్థితి ఏర్పడడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్‌లో కొన్ని రోజులుగా కిలో టమాటా 3 రూపాయిల పలికింది. ఇప్పుడు మరింత పతనమై కిలో టమాటా 50పైసలకు చేరింది. మంచి దిగుబడి వచ్చే సమయంలో ధర పడిపోవడంతో టమాటా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడి కూడా రావడం లేదని రైతుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పత్తికొండ ప్రాంతంలో ప్రతి రైతు ఏటా కనీసం అర ఎకరా నుంచి ఐదెకరాల వరకు సాగు చేస్తారు. సెప్టెంబరులో అధిక మొత్తంలో సరకు వస్తుండటంతో ధరలపై తీవ్ర ప్రభావం పడింది. మంచి నాణ్యత ఉన్న టమాటాను సైతం వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేయడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట కోత కూలీ, రవాణా ఖర్చులు కూడా రావడం లేదని వాపోతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే టమాటా రైతులకు అప్పులు తప్ప ఏమీ మిగలవని, ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చంద్రయాన్-3 సాధించిన అరుదైన ఘనత !! వీడియో విడుదల చేసిన యూట్యూబ్ ఇండియా
చాట్‌జీపీటీ అద్భుతం.. 17 మంది డాక్టర్ల వల్ల కాని పని చేసి చూపిందట
చిప్స్ తిని అస్వస్థతకు గురై చనిపోయిన బాలుడు.. ఛాలెంజ్‌లో భాగంగా ఘటన
ESI హాస్పిటల్‌లో దారుణం.. లిఫ్టు ఎక్కడమే పాపమైంది
అంతిమ యాత్రలో అపశ్రుతి.. మృతదేహాన్ని వదిలేసి వెళ్లిన బంధువులు