Chandrababu Arrest: చంద్రబాబుకు బెయిల్ వస్తుందా.. రాదా..? సర్వత్రా ఉత్కంఠ..
Chandrababu Naidu Arrest: స్కిల్ డవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్ 10వ రోజుకు చేరుకుంది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబుకు సంబంధించిన నాలుగు పిటిషన్లపై ఇవాళ న్యాయస్థానాల్లో కీలక విచారణ జరగనుంది. ఇవాళ హైకోర్టులో చంద్రబాబు రిమాండ్ రద్దు పిటిషన్ పై విచారణ జరగనుంది. రిమాండ్ సస్పెండ్ చేయాలని చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్‌పై కూడా హైకోర్టులో విచారణ జరగనుంది.
Chandrababu Naidu Arrest: స్కిల్ డవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్ 10వ రోజుకు చేరుకుంది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబుకు సంబంధించిన నాలుగు పిటిషన్లపై ఇవాళ న్యాయస్థానాల్లో కీలక విచారణ జరగనుంది. ఇవాళ హైకోర్టులో చంద్రబాబు రిమాండ్ రద్దు పిటిషన్ పై విచారణ జరగనుంది. రిమాండ్ సస్పెండ్ చేయాలని చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్‌పై కూడా హైకోర్టులో విచారణ జరగనుంది. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ పిటిషన్ పైనా ఏసీబీ కోర్టులో విచారణ జరనుంది. అంతేకాకుండా చంద్రబాబును ఐదురోజుల కస్టడీకి ఇవ్వాలని సీఐడీ పిటీషన్ పైనా విచారణ జరనుంది. అవుటర్ రింగ్‌రోడ్, అంగల్లు ఘర్షణ, విజయనగరం కేసులపై చంద్రబాబు తరపున వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై కూడా విచారణ జరనుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు బెయిల్ వస్తుందా..? రాదా..? టీడీపీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది.
చంద్రబాబు తరుపున సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా టీడీపీ తరపున మరో సీనియర్ అడ్వకేట్ రంగంలోకి దిగారు. సిద్దార్ద్ అగర్వాల్ అనే సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ చంద్రబాబు తరుపున ఇవాళ వాదనలు వినిపించనున్నారు. CID తరపున మాజీ అటార్నీ జనరల్ ముఖుల్ రోహత్గి, ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించనున్నారు.
ఇదిలాఉంటే.. రాజమండ్రిలోనే నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి, బ్రాహ్మిణి, బాలకృష్ణ సతీమణి వసుంధర, మనవడు దేవాన్ష్ ఉన్నారు. నాలుగు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన లోకేశ్ ఇవాళ రాజమండ్రి చేరుకునే అవకాశం ఉంది. రాజమండ్రిలో ఆదిరెడ్డి వాసు ఆధ్వర్యంలో నిరాహార దీక్షకు జనసేన నేత కందుల దుర్గేష్ మద్దతు పలకనున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..