Andhra: కిరాణా సామాన్లు కావాలన్నాడు.. ఆమె ఇచ్చేందుకు వెళ్లగా.. ఎవరూ చూడట్లేదని
అతడు కిరాణా సామాన్లు కావాలని షాప్‌కు వచ్చాడు. పాపం.! ఈమె ఏం జరుగుతుందో తెలియక సామాన్లు కట్టేందుకు వెనక్కి తిరిగింది. ఇంతలో ఊహించని రీతిలో జరగాల్సింది జరిగింది. ఈ ఘటన పెద్దాపురంలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయ్. ఓసారి లుక్కేయండి.
కాకినాడ జిల్లా పెద్దాపురంలో గడిచిన నెలలో వరుసగా 3 చోట్ల చైన్ స్నాచింగ్ ఘటనలు జరిగాయి. గుడికి వెళుతున్న ఒంటరి మహిళలే టార్గెట్‌గా చైన్ స్నాచింగ్ చేస్తున్నారు గుర్తు తెలియని దుండగులు. జూలై 26వ తేదీన పెద్దాపురం మేధర వీధిలో బొడ్డు రమణ కుమారి అనే మహిళ మెడలో మూడు కాసుల బంగారు చైన్ అపహరించగా.. ఆపై ఆగష్టు 30వ తేదీన తొలి తిరుపతికి వెళ్లే దారిలో ఓడల లక్ష్మీ అనే మహిళ మెడలో నుంచి నాలుగు కాసుల బంగారు చైన్ స్నాచింగ్‌కు గురైంది.
ఇక ఆగష్టు 31వ తేదీన పెద్దాపురం బ్యాంకు కాలనీలో కిరాణ కొట్టులో ఒంటరిగా ఉన్న లక్ష్మీ అనే వృద్దరాలి మెడలో 4 కాసుల బంగారు హారాన్ని దొంగలించారు దుండగులు. ఇలా వరుసగా చైన్ స్నాచింగ్ ఘటనలు జరుగుతుండటంతో ఒంటరిగా బయటికి రావాలంటేనే హడలిపోతున్నారు మహిళలు. స్థానిక పోలీసులు నిఘా పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!

