వంటకు రాగి పాత్రలు వాడితే ఏమవుతుందో తెలుసా? వీడియో

Updated on: Mar 04, 2025 | 2:27 PM

ఇటీవల రాగిపాత్రల వాడకం ఎక్కువైంది. ఆరోగ్య రీత్యా రాగి పాత్రలను చాలామంది అనేక విధాలుగా ఉపయోగిస్తున్నారు. రాగి పాత్రలో నీళ్లు తాగితే మంచిదని రాగితో చేసిన వాటర్‌ బాటిళ్లను వాడుతున్నారు. పూర్వం కాలంలో రాత్రి వేళ పడుకునే ముందు రాగి చెంబుతో మంచి నీళ్లను తల దగ్గర పెట్టుకుని పడుకునేవారు. తెల్లవారి లేస్తూనే ఆ రాగి చెంబులో నీళ్లు తాగేవారు. దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు కూడా చెబుతున్నారు. రాగి పాత్రలో నీళ్లు తాగితే కడుపులో అల్సర్లు, అజీర్తి వంటివి తగ్గుతాయిని చెబుతున్నారు. రాగిలో యాంటా బాక్టీరియల్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి.

రాగిపాత్రల్లో వండిన ఆహారం తింటే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందంటున్నారు. ఆహారం త్వరగా జీర్ణమవడమే కాకుండా, గ్యాస్‌ తో కడుపు ఉబ్బరం సమస్యలు దరిచేరవట. మెదడు పనితీరు మెరుగుపడటమే కాకుండా, ఎముకల వ్యాధులనుంచి కూడా కాపర్‌ రక్షిస్తుందట. పుల్లటి పదార్ధాలు అంటే టమాటా, వెనిగర్‌, చింతపండుతో చేసే వంటలు రాగిపాత్రల్లో చేయకపోవడమే మంచిదని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. వండిన వంటను కూడా ఎక్కువ సమయం రాగిపాత్రల్లో నిల్వ ఉంచకూడదట. దానివల్ల ఆహార పదార్ధాల రంగు, రుచి మారిపోయే అవకాశం ఉందంటున్నారు. స్టీలు, అల్యూమినియం పాత్రలకంటే రాగిపాత్రలు త్వరగా వేడెక్కుతాయి. దీనివల్ల వంటగ్యాస్‌ కూడా ఆదా అవుతుంది. రాగి పాత్రలు త్వరగా నల్లగా మారతాయి. వీటి రంగు మారకుండా ఉండేందుకు వీటిని శుభ్రం చేసేటప్పుడు ఉప్పు, చింతపండు, నిమ్మకాయ, బేకింగ్‌ సోడాను ఉపయోగించి శుభ్రం చేస్తే త్వరగా రంగు మారవని సూచిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

డైలీకూలీగా సిటీకి వచ్చిన తాపీమేస్త్రి.. కొన్ని రోజుల్లోనే కోట్లకు పడగలెత్తి..

బస్సు కోసం ఒంటరిగా నిల్చున్న యువతి.. అక్కాఅంటూ పిలిచి వీడియో

అక్బర్‌ నిర్మించిన శివాలయం తెలుసా..గుర్రాలు గుర్తించిన శివలింగం ఇదే! వీడియో

ఆలయంలో వ్యక్తి వింత ప్రవర్తన.. శివపార్వతులు కనిపించారంటూ వీడియో