Meet SpaceBok: మార్స్‌పైకి నాలుగు కాళ్ల రోబో… ఈ రోబో ఏం చేస్తుందో తెలుసా..?? ( వీడియో )
అనంత విశ్వంలో భూమిపై కాకుండా ఇంకెక్కడైనా జీవం ఉందా..? అన్నదానిపై చాలా కాలంగా పరిశోధనలు చేస్తున్నారు సైంటిస్టులు. సౌర కుటుంబంలోని వివిధ గ్రహాల మీదకు శాటిలైట్లను పంపుతున్నారు.
అనంత విశ్వంలో భూమిపై కాకుండా ఇంకెక్కడైనా జీవం ఉందా..? అన్నదానిపై చాలా కాలంగా పరిశోధనలు చేస్తున్నారు సైంటిస్టులు. సౌర కుటుంబంలోని వివిధ గ్రహాల మీదకు శాటిలైట్లను పంపుతున్నారు. మార్స్ గ్రహంపైకి రోబోను పంపి, దాని ద్వారా పరిశోధనలు చేసేందుకు ప్రయత్నించారు. కానీ చాలా వరకు అది సక్సెస్ కాలేకపోయింది. ఇక తాజాగా నాలుగు కాళ్లతో నడిచే ఓ రోబోను మార్స్‌పైకి పంపేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు సైంటిస్టులు. స్పాట్.. ఇప్పటికే అంగారకుడిపైకి పంపించిన రోవర్లుగా అంతగా సక్సెస్ కాలేకపోయాయి. గ్రహాలపై రోవర్లు ప్రయాణించే సమయంలో రాళ్లు, రప్పలు, ఇసుక వంటివి మధ్యలోనే రోబోలకు అడ్డుపడుతున్నాయి. వాటి ప్రయాణానికి అవరోధం కలిగిస్తున్నాయి. 2006, 2009 సంవత్సరంలో పంపించిన రోబోలు రాళ్లు, ఇసుకలో చిక్కుకుపోయాయి. దీంతో ఆ పరిశోధనలను మధ్యలోనే ఆపేశారు సైటింస్టులు. అయితే ప్రస్తుతం మార్స్‌పై నాసాకు చెందిన క్యూరియాసిటీ, పర్సవరెన్స్ రోవర్లు, చైనాకు చెందిన ఝరోంగ్ రోవర్ పరిశోధనలు చేస్తున్నాయి.
మరిన్ని ఇక్కడ చూడండి: Kakinada: కాకినాడ మత్స్యకారుడి వలలో చిక్కిన ఖరీదు చేసే చేప.. ( వీడియో )