Kakinada: కాకినాడ మత్స్యకారుడి వలలో చిక్కిన ఖరీదు చేసే చేప… ( వీడియో )
సముద్రంలో చేపలు పట్టే మత్స్య కారులకు అరుదైన చేపలు చిక్కుతుంటాయి. అలా వారి వలకు దొరికిన చేపలు భారీ విలువ చేసేవైతే.. ఇంకా ఆ మత్స్యకారుడి పంట పండినట్లే.
సముద్రంలో చేపలు పట్టే మత్స్య కారులకు అరుదైన చేపలు చిక్కుతుంటాయి. అలా వారి వలకు దొరికిన చేపలు భారీ విలువ చేసేవైతే.. ఇంకా ఆ మత్స్యకారుడి పంట పండినట్లే. రాత్రికి రాత్రే లక్షాధికారి అయిపోవచ్చు. అటువంటి సందర్భాలు గంగపుత్రులకు అప్పుడప్పుడు దక్కుతుంటాయి. ఇక తాజాగా కాకినాడ ఫిషింగ్ హార్బర్‌లో ఓ మత్స్యకారుల బృందానికి లక్షల విలువ చేసే ఓ అరుదైన చేప చిక్కింది. ఫిషింగ్ కోసం వెళ్లిన మత్స్యకారులకు, కచ్చేళ్ల అనే ఓ అరుదైన చేప చిక్కింది. దానికి విలువ అక్షరాల రెండు లక్షల రూపాయాలు ఉంటుందని అంటున్నారు మత్య్సకారులు. ఈ కచ్చేళ్ల చేపలో అద్భుతమైన ఔషధ గుణాలు కలిగి ఉంటాయని, ఆయుర్వేద మెడిసిన్లలో ఈ చేపను ఎక్కువ ఉపయోగిస్తారని తెలిపారు మత్స్యకారులు. అయితే ఈ చేపను కాకినాడకు చెందిన
ఓ వ్యాపారి 2 లక్షల 45 వేల రూపాయలకు కొనుగోలు చేశాడు.
మరిన్ని ఇక్కడ చూడండి: విశాఖలో ఆధార్ కార్డుల పేరుతో మోసాలు… వేలిముద్ర వేస్తే రూ.500/..ఆధార్,పాన్‌కార్డు ఉంటే..!! ( వీడియో )