Dasara Holidays: దసరా సెలవుల తేదీలు వచ్చేశాయ్..!
బడి పిల్లలకు సెలవులంటే పండగే. ముఖ్యంగా దసరా, సంక్రాంతి వంటి పండుగల కోసం విద్యార్థులు ఎదురుచూస్తుంటారు. తెలంగాణలో అయితే దసరాకు ముందు తొమ్మిది రోజులపాటు బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తారు. తొమ్మిది రోజులపాటు మహిళలు అంతా ఒక్కచోట చేరి కూడళ్లలో, ప్రత్యేక స్థలాల్లో బతుకమ్మలను తీసుకువచ్చి ఆటలు ఆడుతారు. పాటలు పాడుతారు.
అటు.. ఏపీలో తిరుపతిలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు, ఇంద్రకీలాద్రి శరన్నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా ఈ సమయంలో ఘనంగా జరుగుతాయి. అయితే.. ఎప్పటి లాగే ఈ ఏడాది కూడా విద్యాశాఖ దసరా సెలవులను ప్రకటించింది. నిరుటితో పోల్చితే ఈ ఏడాది కాస్త ముందుగానే రానున్న దసరా సెలవుల సంఖ్య కూడా ఈసారి ఎక్కువగానే ఉంది. ఇక తేదీల విషయానికి వస్తే.. తెలంగాణలో సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3 వరకు.. మొత్తం 13 రోజుల పాటు ప్రభుత్వ పాఠశాలలకు దసరా సెలవులను ప్రకటించారు. అటు..ఆంధ్రప్రదేశ్లో సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు ఇవ్వనున్నారు.ఆంధ్రప్రదేశ్లో కంటే తెలంగాణలో రెండు రోజులు ఎక్కువగా సెలవులు రానున్నాయి. మొత్తంగా దసరాకు తెలంగాణలో 12 రోజులపాటు, ఉండనున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 10 రోజులు సెలవులు ఇవ్వనున్నారు. తెలంగాణలో దసరా సెలవులు అక్టోబర్ 3తో ముగుస్తాయి. 4వ తేదీ విద్యాసంస్థలు పనిచేస్తాయి. కానీ, మర్నాడు.. అంటే అక్టోబరు 5వ తేదీ నాడు మిలాన్ ఉన్ నబీ సెలవు ఉంటుంది. అటు.. ఆంధ్రప్రదేశ్ లోని క్రైస్తవ విద్యాసంస్థలకు దసరా సెలవులు ప్రత్యేకంగా ప్రకటించారు. ఈ విద్యాసంస్థలకు సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 2 వరకు మాత్రమే ఉండనున్నాయి. ఈ షెడ్యూల్ ఆ పాఠశాల విద్యార్థులతో పాటు సిబ్బందికి కూడా వర్తిస్తుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
క్యాన్సర్ నుంచి శాశ్వత విముక్తి..అందుబాటులోకి ‘రివర్ట్’ టెక్నాలజీ
వాట్సాప్ నుంచి అదిరిపోయే అప్‌డేట్.. ఇక కాల్స్ షెడ్యూలింగ్ సాధ్యమే
మీ బ్యాంకు ఖాతాలో మినిమం బ్యాలెన్స్ ఉందా
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!

