Loading video

World first flex fuel car: ప్రపంచంలోనే తొలి ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు.. ప్రత్యేకలేంటో తెలుసా.!

|

Sep 01, 2023 | 9:50 PM

భవిష్యత్ లో చమురు లభ్యత, పర్యావరణం తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని ప్రపంచ దేశాలు ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలో ఆవిర్భవించిందే ఫ్లెక్స్ ఫ్యూయల్ సాంకేతికత. పెట్రోల్ లో ఇథనాల్ కలిపి ఇంధనంగా ఉపయోగించడమే ఫ్లెక్స్ ఫ్యూయల్ విధానం. ఈ క్రమంలోనే రూపొందిన తొలి కారును కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆవిష్కరించారు. ఇది ప్రపంచంలోనే తొలి ఎలక్ట్రిఫైడ్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు.

భవిష్యత్ లో చమురు లభ్యత, పర్యావరణం తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని ప్రపంచ దేశాలు ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలో ఆవిర్భవించిందే ఫ్లెక్స్ ఫ్యూయల్ సాంకేతికత. పెట్రోల్ లో ఇథనాల్ కలిపి ఇంధనంగా ఉపయోగించడమే ఫ్లెక్స్ ఫ్యూయల్ విధానం. ఈ క్రమంలోనే రూపొందిన తొలి కారును కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆవిష్కరించారు. ఇది ప్రపంచంలోనే తొలి ఎలక్ట్రిఫైడ్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు. టయోటా ఇన్నోవా హైక్రాస్ కారుకు ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీని అమర్చారు. ఈ కారును బీఎస్-6 స్టేజ్-2 ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేశారు. అత్యుత్తమ ఉద్గార ప్రమాణాలను అందుకునేలా దీన్ని రూపొందించారు. భవిష్యత్తులో బైకులు, ఆటోలు, ఈ-రిక్షాలు వంద శాతం ఇథనాలు వాహనాలుగా మారాలని కోరుకుంటున్నట్టు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఫ్లెక్స్ ఫ్యూయల్ సాంకేతికతో మరిన్ని మోడళ్లు తీసుకురావాలని అకాంక్షించారు. ఫ్లెక్స్ ఫ్యూయల్ విధానం వల్ల వ్యవసాయ రంగంలో మరిన్ని ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుందంటున్నారు నిపుణులు. దేశంలో ఇథనాల్ కు గిరాకీ పెరగడం వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ పురోగతికి సంకేతమని, ఇకపై అన్నదాత ఇంధనదాతగా మారతాడని భావిస్తున్నారు. ఇథనాల్ ను ఆహార ధాన్యాలు, ఆహార పంటల నుంచి తయారుచేస్తారు. ఇథనాల్‌కు గిరాకీ పెరిగితే.. జీడీపీలో వ్యవసాయ రంగ వాటా 20 శాతానికి పెరుగుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..