భారత్‌లో స్టార్‌లింక్ సేవలు.. ఇక పల్లెల్లోనూ హైస్పీడ్ నెట్
కరోనా లాక్‌డౌన్ సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ కష్టాలు ఎదురయ్యాయి. ఇప్పుడు శాటిలైట్ ఇంటర్నెట్, ముఖ్యంగా స్టార్‌లింక్ ద్వారా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ లేకుండానే నేరుగా ఆకాశం నుంచి హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను అందిస్తుంది. మహారాష్ట్ర ఈ సేవలను విస్తరించడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఇది విద్య, ఆరోగ్యం, పరిపాలనలో డిజిటల్ విప్లవం తీసుకువస్తుంది.
కరోనా లాక్‌డౌన్ సమయంలో ఇంటర్నెట్ కష్టాలు ఎలా ఉంటాయో స్వయంగా అనుభవించి చూశాం. ఆన్‌లైన్ క్లాస్‌ల కోసం స్టూడెంట్స్, వర్క్ ఫ్రమ్ హోం కోసం ఉద్యోగులు ఇంటర్నెట్ సిగ్నల్ కష్టాలు చవిచూశారు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఫోన్ మాట్లాడాలంటే ఏ చెట్టో లేక బిల్డింగో ఎక్కితేగానీ సిగ్నల్ అందని పరిస్థితి. ప్రస్తుతం విద్య, వైద్యం సహా అనేక రకాల సేవలు ఇంటర్నెట్ ద్వారా లభిస్తున్నాయి. అయితే..నేటికీ గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో హై-స్పీడ్ ఇంటర్నెట్ లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే..భారత్‌లో శాటిలైట్ హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు త్వరలోనే అందుబాటులోకి రానుండటంతో ఈ కష్టాలకు చెక్ పడనుంది. ఇకపై.. OFC కేబుళ్లు, టవర్లు గానీ లేకుండానే నేరుగా నేరుగా ఆకాశం నుంచి అందే సిగ్నల్ ద్వారా హై-స్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందించే టెక్నాలజీ ఇది. శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ప్రపంచ కుబేరుడు ఎలాన్‌మస్క్ చేపట్టిన స్టార్‌లింక్ ప్రాజెక్టు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చాలాచోట్ల టెస్ట్ రన్ పూర్తి చేసుకుంది. అవన్నీ విజయవంతమయ్యాయి. ఈ సేవలను భారత్‌లోని మారుమూల ప్రాంతాలకు విస్తరించేందుకు కొన్ని రాష్ట్రాలు ప్రయత్నాలు ప్రారంభించాయి. వాటిలో మహారాష్ట్ర ముందు వరుసలో నిలుస్తోంది. మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం ద్వారా స్టార్‌లింక్ అధికారికంగా భారత మార్కెట్లోకి ప్రవేశించింది. సీఎం ఫడ్నవీస్ సమక్షంలో స్టార్‌లింక్ వైస్ ప్రెసిడెంట్ లారెన్ డ్రేయర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ కార్యదర్శి వీరేంద్ర సింగ్ ‘లెటర్ ఆఫ్ ఇంటెంట్’ పై సంతకం చేశారు. గ్రామీణ పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ సౌకర్యాలకు హై-స్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తుంది. డిజిటల్ మహారాష్ట్ర మిషన్‌లో భాగమైన ఈ ప్రాజెక్ట్, స్టార్‌లింక్ భారత ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు పొందిన తర్వాత కొనసాగుతుంది. ఈ ప్రాజెక్ట్ గిరిజన ప్రాంతాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, తీరప్రాంత మండలాలు, విపత్తు నియంత్రణ కేంద్రాలు, అటవీ కేంద్రాలు, ఓడరేవులు వంటి ఇతర కీలక మౌలిక సదుపాయాలకు కనెక్టివిటీని అందిస్తుంది. ఈ ప్రాజెక్టు ద్వారా విద్య, ఆరోగ్యం, లోకల్ గవర్నెన్స్ మెరుగుపడుతుందని మహారాష్ట్ర సర్కారు అంచనా వేస్తోంది. లైవ్ స్ట్రీమింగ్, టెలీ-మెడిసిన్, ఆన్‌లైన్ లెర్నింగ్ వంటి సేవలతో పాటు అత్యవసర సమయాలు, విపత్తుల్లో మద్దతు ఇవ్వగల డిజిటల్ మౌలిక సదుపాయాలను స్టార్‌లింక్ ప్రాజెక్ట్ అందజేస్తుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భారత్‌కు రష్యా బంపర్ ఆఫర్.. శత్రు దేశాలకు ఇక.. దబిడి దిబిడే
నడిరోడ్డుపై వ్యక్తి పరుగులు.. ప్లాన్డ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు
మన అనకాపల్లి అమ్మాయే.. వరల్డ్ కప్ క్రికెట్ కామెంటేటర్
కాలు నొప్పిగా ఉంది.. వైద్యం చేయమని అడిగిన వీధి కుక్క.. వీడియో వైరల్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

