ఆటోలో నగల బ్యాగ్.. డ్రైవర్ ఏం చేశాడంటే
అనంతపురంలో ఓ పెళ్లికి వెళ్లిన నంద్యాల దంపతులు ఆటోలో 12 తులాల బంగారు నగలు మర్చిపోయారు. నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్ చంద్రశేఖర్ బ్యాగును పోలీసులకు అప్పగించి, తిరిగి దంపతులకు చేరేలా చేశాడు. పోలీసులు, దంపతులు చంద్రశేఖర్ ను సన్మానించి, అతని గొప్ప మనసును ప్రశంసించారు. ఈ సంఘటన నిజాయితీకి ప్రతీకగా నిలిచింది.
రోడ్డుమీద ఏదైనా వస్తువో, డబ్బులో దొరికితే ఎవరైనా మొదట చుట్టూ పరిశీలిస్తారు..అక్కడున్నవారిని అడుగుతారు..ఎవరూ లేకపోతే వాటిని తామే తీసుకొని వెళ్లిపోతారు. కొందరు ప్రయాణికులు ఆటోల్లో, బస్సుల్లో ప్రయాణించేటప్పుడు పొరపాటున బ్యాగులు మర్చిపోతుంటారు. వాటిలో డబ్బు ఉండొచ్చు.. విలువైన నగలు ఉండొచ్చు. అలా చాలామంది పోగొట్టుకుంటూ ఉంటారు. తాజాగా ఓ ఆటోలో ప్రయాణించిన ఓ జంట తమ నగల బ్యాగును మర్చిపోయారు. అయితే, ఆ బ్యాగు చూసిన ఆటోడ్రైవర్ తర్వాత చేసిన పనికి అందరూ ఫిదా అవుతున్నారు. నంద్యాల జిల్లాకు చెందిన సూర్యనారాయణ, లక్ష్మీబాయి దంపతులు అనంతపురంలో ఓ పెళ్లికి హాజరయ్యారు. పెళ్లి వేడుక తర్వాత వారు నేరుగా మారుతీ నగర్ నుంచి బస్టాండుకు వెళ్లేందుకు ఆటో బుక్ చేసుకున్నారు . బస్టాండుకు వెళ్లే సరికి వారు ఎక్కాల్సిన బస్ బయలుదేరబోతుండటంతో.. వారు హడావుడిగా లగేజీ బ్యాగులు తీసుకుని బస్ ఎక్కేశారు. అయితే.. ఆ హడావుడిలో బంగారు నగలున్న హ్యాండ్ బ్యాగ్‌ను ఆటోలోనే మరిచిపోయి.. నంద్యాలకు వెళ్లిపోయారు. తర్వాత ఆటో డ్రైవర్ చంద్రశేఖర్ తన ఆటోలో బ్యాగును గమనించి..అది ఆటోలో ప్రయాణించిన దంపతులదేనని అనుకుని, నేరుగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు వెళ్లి బ్యాగును పోలీసులకు అప్పగించాడు. బ్యాగ్ ఓపెన్ చేసిన పోలీసులకు… అందులో బంగారు ఆభరణాలు కనిపించాయి… వెంటనే ఆటో బుక్ చేసుకున్నప్పుడు ఉన్న ఫోన్ నెంబర్ ఆధారంగా బాధితులు సూర్యనారాయణ, లక్ష్మీబాయి దంపతులకు పోలీసులు ఫోన్ చేయటంతో ఆ దంపతులు నేరుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి.. పోలీసులు చేతుల మీదగా తమ నగల బ్యాగును తీసుకున్నారు. కాగా, 12 తులాల బంగారు నగలున్న బ్యాగ్‌ను తిరిగి ఇచ్చి నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్ చంద్రశేఖర్ ను మెచ్చుకున్న పోలీసులు అతడిని సన్మానించారు. అలాగే, నిజాయితీగా తమ సొమ్మును కాపాడినందుకు సంతోషించిన సూర్యనారాయణ లక్ష్మీబాయి దంపతులు.. ఆటోడ్రైవర్‌కు ఆర్థిక సాయం చేసి అతని నిజాయితీని మెచ్చుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వామ్మో.. కొండచిలువను ఓ ఆటాడుకున్న యువతి
Pawan Kalyan: కాలినడకన అడవిలో పవన్ టూర్
40 వృద్ధ జంటలకు సొంత ఖర్చుతో రెండోసారి పెళ్లి చేసిన పూజారి
USA: ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్ళి మృత్యువాత
ఓర్నాయనో.. ఇక నుంచి వర్షాలే కాదు.. గజగజ వణికించే చలి కూడా.. ఐఎండీ కీలక అప్డేట్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

